Watermelon Seeds: పుచ్చకాయ గింజలను తినకుండా ఉమ్మేస్తున్నారా? అవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయంటే...-spitting out watermelon seeds how good are they for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Watermelon Seeds: పుచ్చకాయ గింజలను తినకుండా ఉమ్మేస్తున్నారా? అవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయంటే...

Watermelon Seeds: పుచ్చకాయ గింజలను తినకుండా ఉమ్మేస్తున్నారా? అవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయంటే...

Haritha Chappa HT Telugu
Apr 17, 2024 08:14 AM IST

Watermelon Seeds: వేసవిలో కచ్చితంగా తినాల్సిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది సీజనల్ ఫ్రూట్. వేసవిలో అధికంగా లభిస్తుంది. అయితే పుచ్చకాయ గింజలను చాలామంది తినకుండా పడేస్తారు.

పుచ్చకాయ గింజలతో ఆరోగ్యం
పుచ్చకాయ గింజలతో ఆరోగ్యం (pexel)

Watermelon Seeds: వేసవిలో ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది తక్కువ ధరకే లభిస్తుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు వీటిని తినగలరు. పుచ్చకాయ తినడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. అయితే పుచ్చకాయ తినేటప్పుడు ఎంతో మంది అందులో ఉన్న విత్తనాలను ఉమ్మేస్తూ ఉంటారు. నిజానికి పుచ్చకాయ గింజలను తినడం చాలా అవసరం. పుచ్చకాయ గింజలు నమలడం వల్ల పొట్టలో మొలకలు వస్తాయనే వాదన ఉంది. అలాంటివి ఏమీ జరగదు. చక్కగా నలుపు, తెలుపు రంగులో ఉన్న పుచ్చకాయ గింజలను తినవచ్చు.

పుచ్చకాయ గింజలను ఎందుకు తినాలి?

పుచ్చకాయ గింజలు తినడం వల్ల శరీరానికి ఫైబర్ పుష్కలంగా అందుతుంది. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా కూడా దానిలో ఐరన్, ఫోలేట్, నియాసిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయ గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పొట్ట అసౌకర్యంగా ఉండడం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

పుచ్చకాయ గింజలు తినడం పూర్తిగా సురక్షితం. ఇవి జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మన శారీరక విధులకు ఇది చాలా అవసరం. అలాగే లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు కావాల్సిన పోషకాలు. పుచ్చకాయ గింజలను గుండె ఆరోగ్యం కోసం తినడం చాలా అవసరం. అలాగే అనేక రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తి కూడా పుచ్చకాయ గింజలకు ఉంది. పుచ్చకాయ గింజలను బయట అమ్ముతూ ఉంటారు.కాబట్టి పుచ్చకాయ పండును తినేటప్పుడు గింజలను బయట ఉమ్మేయకుండా నమిలి మింగేయండి. ఆరోగ్యానికి అన్ని విధాలా మంచే జరుగుతుంది.

Whats_app_banner