ఆరోగ్యానికి ముఖ్యమైన ‘విటమిన్ కే’ పుష్కలంగా ఉండే ఫుడ్స్

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 17, 2024

Hindustan Times
Telugu

ఆరోగ్యానికి విటమిన్ కే చాలా ముఖ్యం. ఎముకల దృఢత్వం, గుండె ఆరోగ్యం, రక్తం మెరుగ్గా ఉండడం సహా చాలా వాటికి సరిపడా విటమిన్ కే తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ కే పుష్కలంగా ఉండే 5 రకాల ఆహారాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. 

Photo: Pexels

పాలకూర, కేల్, బచ్చలికూర లాంటి ఆకుకూరల్లో విటమిన్ కే మెండుగా ఉంటుంది. ఆహారంలో ఇవి తీసుకోవడం చాలా ముఖ్యం. 

Photo: Pexels

క్యాబేజ్‍లో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల గుండె, కడుపు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

Photo: Pexels

విటమిన్ కే పుష్కలంగా ఉండే కూరగాయల్లో బ్రకోలీ కూడా ఒకటి. ఈ కూరగాయ తినడం వల్ల ఎముకల దృఢత్వానికి మంచి జరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. 

Photo: Pexels

కోడిగుడ్లలోనూ విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్లతో పాటు మరికొన్ని విటమిన్లు సహా చాలా పోషకాలు గుడ్లలో ఉంటాయి. అందుకే వీటిని రోజూ తినడం మేలు. 

Photo: Pexels

బ్లూబెర్రీల్లో విటమిన్ కే, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవడం సహా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Photo: Pexels