వేసవిలో చర్మం మెరుగ్గా ఉండేందుకు ఈ 5 రకాల ఫుడ్స్ తినండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 29, 2024

Hindustan Times
Telugu

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం చర్మంపై కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే చర్మం మెరుగ్గా ఉండేందుకు ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో చర్మం మెరుగ్గా, హైడ్రేటెడ్‍గా ఉండేందుకు తీసుకోవాల్సిన కొన్ని ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

పుచ్చకాయ, నారింజ, స్ట్రాబెర్రీల్లాంటి హైడ్రేషన్ ఇచ్చే పండ్లను వేసవిలో తప్పక తినాలి. వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. 

Photo: Pexels

పాలకూర, కేల్, స్విస్ చార్జ్ లాంటి ఆకుకూరలను కూడా వేసవిలో తినాలి. వీటిలో ఉండే హైడ్రేటింగ్ గుణాలు, విటమిన్లు.. మీ చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

Photo: Pexels

అవకాడోల్లో విటమిన్ సీ, ఈ, హెల్దీ ఫ్యాట్స్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. దీంతో ఇది తినడం వల్ల చర్మానికి తేమ పెరుగుతుంది. చర్మానికి రక్షణ కల్పిస్తుంది. 

Photo: Pexels

క్యారెట్, బీట్‍రూట్, ర్యాడిష్ లాంటి దుంప కూరగాయలను తినడం కూడా చర్మానికి చాలా మంచిది. వీటిలో ఉండే బీటా కరోటిన్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. మంట, మొటిమలు, మచ్చలు తగ్గేందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

కీరదోస తినడం వల్ల చర్మం మెరుగ్గా ఉంటుంది. దీంట్లో అధిక శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. దీనిద్వారా చర్మాన్ని హైడ్రేటెడ్‍గా చేస్తుంది. 

Photo: Pexels

రాత్రివేళ ఈ ఆహారాలు తింటే ఊబకాయం పెరిగే రిస్క్

Photo: Pexels