తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Propose: అమ్మాయిలు ముందుగా ఎందుకు ప్రపోజ్ చేయరో తెలిస్తే అబ్బాయిలు ఆశ్చర్యపోతారు

Love Propose: అమ్మాయిలు ముందుగా ఎందుకు ప్రపోజ్ చేయరో తెలిస్తే అబ్బాయిలు ఆశ్చర్యపోతారు

Haritha Chappa HT Telugu

24 October 2024, 9:02 IST

google News
  • Love Propose: ప్రేమలో పడిన అమ్మాయి, అబ్బాయిల్లో… మొదట అబ్బాయిలే ప్రపోజ్ చేస్తారు. అమ్మాయిలు మాత్రం అబ్బాయిలు  ప్రేమను ప్రపోజ్ చేసే వరకు వెయిట్ చేస్తారు కానీ, తాము ముందుగా ప్రపోజ్ చేయరు. అలా ఎందుకు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అబ్బాయిలే ఎందుకు ప్రపోజ్ చేయాలి?
అబ్బాయిలే ఎందుకు ప్రపోజ్ చేయాలి? (shutterstock)

అబ్బాయిలే ఎందుకు ప్రపోజ్ చేయాలి?

నేటి కాలంలో అమ్మాయిలు చేయలేని పనంటూ ఏదీ లేదు. కానీ ప్రేమను ప్రపోజ్ చేయడంలో మాత్రం వారు ఇంకా వెనకబడే ఉన్నారు. ప్రేమను వ్యక్తీకరించే విషయానికి వస్తే, అమ్మాయిలు ఎప్పుడూ చొరవ తీసుకోరు. ఎప్పుడూ అబ్బాయే ప్రేమను చెప్పాలని భావిస్తారు. అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేసే వరకు వెయిట్ చేస్తారు. ఇలా అమ్మాయిలు ఎందుకు ముందుగా లవ్ ప్రపోజ్ చేయరో తెలిస్తే అబ్బాయిలు ఆశ్చర్యపోవడం ఖాయం.

తిరస్కరణ తట్టుకోలేరు

తాము ముందుగా ప్రపోజ్ చేస్తే అబ్బాయి ఒక్కోసారి తిరస్కరించవచ్చు. వారు తిరస్కరణను తట్టుకోలేరు. తమను కాదనడం వారిని ఎంతో బాధపెడుతుంది. అది వారిని మానసికంగా చిత్రహింసలా ఉంటుంది. ప్రేమలో తిరస్కరణ గురైన అమ్మాయి మానసికంగా చాలా కుంగిపోతుంది.

ఆత్మగౌరవానికి మచ్చ

అమ్మాయిలు ఎప్పుడూ అబ్బాయికి ప్రపోజ్ చేయరు. తమలో కొండంత ప్రేమ ఉన్నప్పటికీ అబ్బాయి బయటపడే వరకు వెయిట్ చేస్తారు. తామే ముందుగా ప్రపోజ్ చేయడం అనేది వారి ఆత్మగౌరవాన్ని తగ్గించుకున్నట్టు భావిస్తారు. తమను తాము తగ్గించుకున్నట్టు అనుకుంటారు. అలా చేస్తే అబ్బాయి తమను గౌరవించడని వారు భావిస్తారు. అలాగే అబ్బాయి ప్రేమలో తరచూ తమను బెదిరించే అవకాశం ఉందని నమ్ముతారు. ప్రేమను ముందుగా తామే బయటపెడితే తమ రిలేషన్షిప్లో ఎప్పుడూ తలవంచుకునే ఉండాలని భావిస్తారు.

బోల్డ్ అనుకుంటారని

సమాజంలో అమ్మాయిల విషయమైన కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వారు ఎలా ఉండాలన్నది కూడా సొసైటీ నిర్ణయిస్తుంది. తమకు నచ్చిన అబ్బాయికి ముందుగా ప్రపోజ్ చేసే అమ్మాయిలకు బోల్డ్ అనే ట్యాగ్ ఇస్తారు. అలా బోల్డ్ అమ్మాయి అనిపించుకోవడం ఇష్టం లేక కూడా ఎంతో మంది అమ్మాయిలు ప్రేమను లోపతే దాచుకుంటారు. అబ్బాయి బయటపెట్టేవరకు వారు బయటపడరు. అందుకే ఆమె తన ప్రేమను ఏ అబ్బాయితోనూ స్వయంగా వ్యక్తపరచదు.

ప్రిన్సెస్ ఫీలింగ్

ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే యువరాణిలా ఫీలవ్వడం అనే భావన చిన్నప్పటి నుంచి అమ్మాయిల మదిలో ఉంటుంది. అలాంటప్పుడు అమ్మాయిలు స్పెషల్ ఫీలింగ్స్ ఎలా మిస్ అవుతారు? అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా డేటింగ్ కు వెళ్లడానికి ఇష్టపడతారని పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే అమ్మాయిలు మొదట అబ్బాయికి ప్రపోజ్ చేయరు. ఎందుకంటే వారికి ప్రత్యేకమైన అనుభూతి కావాలి. అలా అనుభూతి కావాలంటే మొదట అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి. అందుకే అమ్మాయిలు అలా వెయిట్ చేస్తారు తప్ప ప్రేమను వ్యక్తపరచరు.

కాబట్టి అబ్బాయిలు మీరు ఏ అమ్మాయినైనా ప్రేమిస్తే వీరే వెళ్లి ప్రపోజ్ చేయండి. అంతే తప్ప వారే చెప్పాలని వెయిట్ చేయకండి. అమ్మాయిలు ఎప్పటికీ చెప్పకపోవచ్చు. వారికి కావాల్సిన విలువ, ప్రేమ మీ నుంచి దక్కుతాయనే నమ్మకం ఉంటే కచ్చితంగా మీ ప్రేమను ఏ అమ్మాయైన ఒప్పుకుంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం