తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Emotionally Weak | మీరు మానసికంగా బలహీనులు అని భావిస్తున్నారా? మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండిలా!

Emotionally Weak | మీరు మానసికంగా బలహీనులు అని భావిస్తున్నారా? మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండిలా!

HT Telugu Desk HT Telugu

21 June 2023, 8:30 IST

google News
    • Emotionally Weak: జీవితంలో కొంత భయం భక్తి ఉండటం మంచిదే. కానీ పూర్తిగా భయంతోనే బ్రతికితే, ఏం చేస్తే ఏం జరుగుతుందోనని అన్నింటికీ భయపడితే ముందడుగు వేయలేం, ఎప్పటికీ అభివృద్ధి సాధించలేం. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలను తెలుసుకోండి.
Emotionally Weak
Emotionally Weak (istock)

Emotionally Weak

Emotionally Weak: కొన్నిసార్లు మనం మనకు తెలియకుండానే ఇతరుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోడానికి ప్రయత్నిస్తాము, నిరంతరం వారి మెప్పు పొందేలా ఉండాలని భావిస్తాము. ఇతరులను ఎలా సంతోషపెట్టాలి, వారిని ఎలా సంతృప్తిపరచాలి, వారి కోపానికి గురికాకుండా ఎలా ఉండాలి అనుకుంటూ వారిని అర్థం చేసుకోవడానికి, వారి ఆలోచనలు స్కాన్ చేసే రీతిలో ఉంటాము. దీనినే ఎమోషనల్ మానిటరింగ్ అని పిలుస్తారు. కానీ ఈ ప్రక్రియలో మనల్ని మనం కోల్పోతున్నాం, మన నిజమైన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం అన్న సత్యాన్ని గ్రహించలేము.

ఎవరైతే చిన్నప్పటి నుంచి భయంతో పెరుగుతారో, కొన్ని కట్టుబాట్లు, పరిమితుల మధ్య పెరుగుతారో వారు పెరిగే క్రమంలోనూ ఇతరులకు ఎమోషనల్ మానిటర్లుగా వ్యవహరిస్తారు అని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. పొరపాటున ఏదైనా తప్పు దొర్లితే తీవ్రమైన శిక్షలను ఎదుర్కోవలసి వస్తుందనే భయం ఇలాంటి వారి మనసులో ఉంటుందని చెబుతున్నారు.

క్రమశిక్షణ కలిగి ఉండటం, జీవితంలో కొంత భయం భక్తి ఉండటం మంచిదే. కానీ పూర్తిగా భయంతోనే బ్రతికితే, ఏం చేస్తే ఏం జరుగుతుందోనని అన్నింటికీ భయపడితే ముందడుగు వేయలేం, ఎప్పటికీ అభివృద్ధి సాధించలేం. దీనివల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది, ఆత్మ న్యూనత భావాలు పెరుగుతాయని అంటున్నారు.

ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలను మనస్తత్వవేత్త నికోల్ లెపెరా సూచించారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

అతిగా ఆలోచించకండి

విరామం తీసుకోండి ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండే ప్రయత్నం చేయండి. తక్షణమే స్పందిచకుండా మనం కొంత విరామం తీసుకోవాలి, పనులను నెమ్మదించాలి. ఇతరులను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనం గమనించాలి.

ఆత్మపరిశీలన

మనం ఇతరుల మనోభావాల గురించి ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినప్పుడు, ఆత్మపరిశీలన చేసుకోవడానికి మనకు సమయం దొరకదు. మార్పు కోసం, మనం కలిగి ఉన్న ఆలోచనలను జర్నల్ చేయాలి, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి.

భావోద్వేగ సహనం

అతిగా భావోద్వేగం చెందకండి, కొంత సహనం ప్రదర్శించండి. మీకు మీరుగా కొన్ని సరిహద్దులను కలిగి ఉండాలి. ఎంత మేరకు అవసరమో అంతే స్పందించాలి. లేదా నిశబ్దంగా ఉండాలి.

పరిపూర్ణతను కోరుకోవద్దు

అన్నీ చక్కగా పరిపూర్ణంగా చేయాలి అని అనుకోవద్దు. తప్పులు జరగుతాయేమో అని భయపడవద్దు. ఎవరైనా తప్పులు చేయడం సహజం అనే విషయాన్ని తెలుసుకోవాలి.

యోగా- ధ్యానం చేయండి

మీ ఆలోచనలను నియంత్రించడానికి, భావోద్వేగాలను అదుపు చేయడానికి యోగా, ధ్యానం వంటివి చేయండి. ఈ అభ్యాసాలు మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా దృఢంగా మారుస్తాయి.

తదుపరి వ్యాసం