HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parotta: మైదాతో చేసిన పరోటాలు ప్రతిరోజూ తింటున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త

Parotta: మైదాతో చేసిన పరోటాలు ప్రతిరోజూ తింటున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త

Haritha Chappa HT Telugu

26 July 2024, 8:00 IST

    • Parotta: పరోటాలు టేస్టీగా ఉంటాయి. దీనిలో ఎన్నో రకాల పరోటాలు లభిస్తాయి. నిజానికి ప్రతిరోజు పరోటా తినే వారి ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే లెక్క.
పరోటాలు
పరోటాలు (Pexel)

పరోటాలు

Parotta: చపాతీలు, పరోటాలను ఎక్కువగా రాత్రిపూట తింటూ ఉంటారు. చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ పరోటాలు మాత్రం ప్రతిరోజూ తినడం మంచిది కాదు. చపాతీలను గోధుమ పిండితో తయారు చేస్తే, పరోటాలను మైదా పిండితో తయారుచేస్తారు. ఇంట్లో గోధుమ పిండితో పరోటాలను తయారు చేసుకొని తింటే ఫరవాలేదు, కానీ బయట మార్కెట్లో మాత్రం పరోటాలను కేవలం మైదాతోనే తయారు చేస్తారు. పిజ్జా, బర్గర్, నూడుల్స్ వంటి కూడా మైదాతోనే రూపొందిస్తారు. ప్రతిరోజూ పరోటాను తింటే... మైదాపిండిని ప్రతిరోజూ తింటున్నట్టే లెక్క. కాబట్టి మీకు పరోటా తినే అలవాటు ఉంటే వెంటనే విడిచి పెట్టడం మంచిది. పరోటాకు బదులు గోధుమ పిండితో చేసిన చపాతీలను తినడం అలవాటు చేసుకోవాలి.

పరోటా ఎందుకు తినకూడదు?

లచ్చా పరోటా, ఆలూ పరాటా, పనీర్ పరాటా ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ఏ పరాటా అయినా తయారయ్యేది మైదాతోనే, కాబట్టి అవి ఆరోగ్యానికి చేసే కీడు ఎక్కువే. మైదాపిండి తయారు చేసేది కూడా కసావా దుంపలు లేదా గోధుమలతోనే కదా అని అనుకోవచ్చు. ఒక ఆహారం మంచిదో, కాదో నిర్ణయించేది... అది తయారయ్యే ప్రక్రియ. మైదాను తయారు చేయడానికి విపరీతంగా శుద్ధి చేస్తారు. ఆ శుద్ధి చేసే ప్రక్రియలో దానికి తెలుపు రంగును తగ్గించేందుకు అనేక రసాయనాలను కలుపుతారు. ఇదే మైదాను అనారోగ్యకమైన ఆహారంగా మారుస్తోంది. గోధుమలా వ్యర్ధాల నుంచి మైదాను తయారు చేస్తారు. వాటికి కొన్ని రకాల కెమికల్స్ ను కలిపి తెల్ల రంగు వచ్చేలా చేస్తారు. దీంతో తయారుచేసిన ఆహారాన్ని తినడం దీర్ఘకాలంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

రవ్వ, మైదా అనేది గోధుమల నుంచి తయారవుతాయి. అయితే ఇవి తయారయ్యే ప్రక్రియలు మాత్రం భిన్నంగా ఉంటాయి. రవ్వ తయారయ్యే ప్రక్రియ సాధారణమైనదే, దాంట్లో ఎలాంటి రసాయనాలు కలపాల్సిన అవసరం లేదు. అందుకే దాని రంగు తక్కువగానే ఉంటుంది. కానీ మైదా మాత్రం తెల్లగా తళతళలాడిపోతూ ఉంటుంది. ఆ తెలుపు రంగును ఇచ్చేది కెమికల్స్. పరోటాలను పూర్తిగా ఈ మైదాతోనే చేయడం వల్ల ప్రతిరోజు ఎన్నో రకాల రసాయనాలు మీ శరీరంలో చేరుతూ ఉంటాయి.

మైదా ఎందుకు తినకూడదు?

మైదాకు తెలుపు రంగు తేవడం కోసం కొంతమంది బ్లీచ్ ను వాడతారు. అలాగే క్లోరిన్, బెంజైల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను కలుపుతారు. ఈ బ్లీచింగ్ ప్రక్రియ వల్ల మైదా హానికరమైన ఆహారంగా మారిపోతుంది. దాంతో చేసిన జిలేబీలు, బాదుషాలు, పరోటాలు, గులాబ్ జామున్‌లు, సోంపాపిడి వంటివి తినడం వల్ల భవిష్యత్తులో డయాబెటిస్ బారిన త్వరగా పడే అవకాశం ఉంది. అలాగే అందులో కలిపిన రసాయనాల వల్ల క్యాన్సర్ వంటి రోగాలు కూడా రావచ్చు. కాబట్టి మైదాతో చేసిన పరోటాలను తినడం మానుకోండి.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి

టాపిక్

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్