Tongue Clean : నాలుకను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
03 September 2023, 9:30 IST
- Tongue Clean Daily : ప్రతిరోజూ పళ్ళు తోముకుంటారు. కానీ కొంతమంది నాలుకను శుభ్రం చేయరు. దీంతో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. నాలుకను శుభ్రంగా ఉంచుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
నాలుక శుభ్రపరచడం అనేది నోటి పరిశుభ్రతకు సంబంధించి.. ముఖ్యమైన అంశం. కొందరు మాత్రం ఈ విషయాన్ని మరిచిపోతారు. మీ మొత్తం నోటి ఆరోగ్యానికి మీ నాలుకతోనూ సంబంధం ఉంటుంది. వారానికోసారి చేస్తే.. సరిపోతుంది కదా.. అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.
నాలుక శుభ్రపరచడం వల్ల కలిగే తక్షణ ప్రయోజనాల్లో ఒకటి నోటి దుర్వాసనను నివారించడం. నాలుక గరుకుగా ఉండి.. శుభ్రంగా లేకుంటే.. ఆహార కణాలు, బ్యాక్టీరియా, మృతకణాలను ట్రాప్ చేస్తుంది. దీనిని తీయకుంటే.. దుర్వాసనతో కూడిన శ్వాసకు వస్తుంది.
హానికరమైన బ్యాక్టీరియాకు నాలుక ప్రధాన సంతానోత్పత్తి ప్రదేశం. మీ నాలుకను శుభ్రపరచడం ఈ బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. నోటి ఇన్ఫెక్షన్లు, దంత క్షయం, చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నాలుక శుభ్రంగా ఉంటే ఆహారాన్ని రుచి చూసే సామర్థ్యాన్ని పెంచుతుంది. పూత లేదా నాలుక శుభ్రంగా లేకుంటే రుచి తెలియదు. రుచుల ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది. ఏది తిన్నా టేస్ట్ అనిపించదు. శుభ్రమైన నాలుక మీ మొత్తం నోటి పరిశుభ్రతను సూచిస్తుంది. మీ నోటిలో బ్యాక్టీరియా(Bacteria) తగ్గించడం ద్వారా కావిటీస్, గమ్ ఇన్ఫ్లమేషన్ వంటి దంత సమస్యలను తగ్గిస్తుంది.
నాలుకపై తెల్లటి లేదా పసుపురంగు పూత నోటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేందుకు సంకేతం. రెగ్యులర్‍గా నాలుక శుభ్రపరచడం ఈ పరిస్థితిని నివారించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుంది.
జర్నల్ సైన్స్ రిపోర్ట్స్, నోటి ఆరోగ్యం.. గుండె జబ్బులు, మధుమేహం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వంటి ఆరోగ్య పరిస్థితుల మధ్య సంబంధాన్ని సూచిస్తున్నాయి. మీ నాలుకను శుభ్రంగా ఉంచుకోవడం మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. నాలుకను నిర్లక్ష్యం చేయడం వలన మీ నోటిలోని ముఖ్యమైన భాగం అపరిశుభ్రంగా ఉంటుంది. నాలుక శుభ్రపరచడం పూర్తి నోటి సంరక్షణకు ఉపయోగపడుతుంది.
శుభ్రమైన నాలుక మీ దంతాలపై మరకలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. కాఫీ, రెడ్ వైన్ వంటి రంగుల ఆహారాలు, పానీయాలు నాలుకపై అవశేషాలను వదిలివేస్తాయి. అవి మీ దంతాలకు బదిలీ కావచ్చు.
మీ నాలుకను సరిగ్గా శుభ్రం చేయడానికి టంగ్ క్లీనర్, మీ టూత్ బ్రష్ వెనుక భాగాన్ని ఉపయోగించండి. బ్యాక్టీరియాను తొలగించడానికి, మీ నాలుక వెనుక నుండి ముందుకి సున్నితంగా గీరి బ్రష్ చేయండి. నాలుక శుభ్రపరచడం అనేది సరైన దంత ఆరోగ్యానికి ముఖ్యమైనది. ఇది నోటి దుర్వాసనను నివారించడం, దంత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం వరకు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. నాలుకను కడగడం మీ రోజువారీ అలవాటుగా ఉండాలి.