తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Celebrations : దీపావళి వేడుకలను ఇలా నిర్వహించుకోండి.. అందరూ ఎంజాయ్ చేస్తారు

Diwali Celebrations : దీపావళి వేడుకలను ఇలా నిర్వహించుకోండి.. అందరూ ఎంజాయ్ చేస్తారు

Anand Sai HT Telugu

12 November 2023, 16:00 IST

google News
    • Diwali Celebration Ideas : దీపావళి పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరడం సహజం. పండుగను మరింత ఉత్సాహంగా చేయడానికి కొన్ని ఆటలను ప్లాన్ చేయండి. కచ్చితంగా మునుపెన్నడూ లేని విధంగా దీపావళి జరుపుకొనేలా చేస్తుంది. దాని కోసం మేం మీకు గేమ్ ఐడియాలను చెబుతాం.
దీపావళి వేడుకలు
దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలు

దీపావళి పండుగ కోసం భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తారు. అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజున, దాదాపు అన్ని కుటుంబాలు ఇంట్లో సందడిగా గడుపుతారు. పండుగ జరుపుకోవడం, పూజలు చేయడం, పటాకులు కాల్చడం, పండగలో ప్రత్యేక ఆహారాన్ని పంచుకోవడం, తినడం ఉంటాయి. దీపావళి రోజున కార్డులు ఆడటం ఎప్పటి నుంచో ఉంది. కార్డులు ఆడటం కొంత కాలం సరదాగా ఉంటుంది, కానీ అది విసుగు చెందడం ప్రారంభమవుతుంది. అలాగే అందరూ ఈ గేమ్‌లో పాల్గొనలేరు.

పిల్లల నుండి పెద్దల వరకు, మర్చిపోలేని దీపావళి వేడుకలను జరుపుకోవడానికి కొన్ని గేమ్‌లను నిర్వహించండి. అందమైన జ్ఞాపకాలతో దీపావళిని ఎంజాయ్ చేయండి.

ఇప్పుడు లూడో ప్లే చేయడానికి లూడో బోర్డు అవసరం లేదు. మొబైల్‌లో లూడో గేమ్‌కు సంబంధించి చాలా యాప్‌లు ఉన్నాయి. ఇది ఒకేసారి నలుగురితో మాత్రమే ఆడగలదనేది నిజం. అయితే రెండు టీమ్‌లు వేసుకుని ఆడండి. ఇది తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది.

దీపావళి రోజున రంగోలీ పెట్టడం విశేషం. దీన్ని మీరు గేమ్‌గా మార్చుకోవచ్చు. రంగోలి వేసే పోటీని నిర్వహించండి. బాగా రంగోలీ గీసిన వారికి చిన్న బహుమతి ఇవ్వండి. ఇది దీపావళి ఆనందాన్ని పెంచుతుంది.

దీపావళి పండుగ సందర్భంగా అందరూ కలిసి కూర్చున్నప్పుడు క్విజ్ పోటీని నిర్వహించవచ్చు. అందరూ ఈ గేమ్‌లో పాల్గొనవచ్చు. అంతే కాదు ఈ గేమ్ ద్వారా మీ ఇంట్లో ఎవరు తెలివైనవారో తెలుసుకోవచ్చు. ఈ పోటీలో గెలుపొందిన వారికి ఆనందాన్ని పెంచేందుకు ఆకర్షణీయమైన బహుమతిని కూడా అందించవచ్చు.

దీపావళి పర్వదినానికి ఇంట్లో రకరకాల వస్తువులు, తిండితో నిండిపోవడం సహజం. ఈ పండుగ నాడు ఇంట్లోని కొన్ని వస్తువులను ఒకచోట చేర్చి, కళ్లకు గంతలు కట్టి, తాకి, అది ఏంటో చెప్పండి. ఇది కూడా అందరికీ నచ్చుతుంది.

పండుగ అంటే సంగీతం, నృత్యం లేకుండా ఎలా ఉంటుంది. ఈ దీపావళిని మరిచిపోలేని దీపావళిగా మార్చడానికి, ఇంట్లో డ్యాన్స్ పార్టీని నిర్వహించండి. ఇది పండుగ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

దీపావళి రోజున కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరినప్పుడు అంత్యాక్షరిని ప్లాన్ చేసుకోవచ్చు. గంటల తరబడి కూడా బోర్ కొట్టని ఆట ఇది.

తదుపరి వ్యాసం