తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes Control Tips: ఈ 5 టిప్స్ పాటిస్తే నియంత్రణలో డయాబెటిస్

Diabetes control tips: ఈ 5 టిప్స్ పాటిస్తే నియంత్రణలో డయాబెటిస్

HT Telugu Desk HT Telugu

18 November 2022, 11:36 IST

google News
  • Diabetes control tips: డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు.

జీవనశైలిలో 5 మార్పులతో డయాబెటిస్ నియంత్రణ
జీవనశైలిలో 5 మార్పులతో డయాబెటిస్ నియంత్రణ (Nataliya Vaitkevich)

జీవనశైలిలో 5 మార్పులతో డయాబెటిస్ నియంత్రణ

దేశంలో ఇతర దీర్ఘకాలిక వ్యాధుల తరహాలోనే డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యువత డయాబెటిస్ బారిన పడుతుండడం కలవరపెడుతోంది. ఇది కేవలం స్వీట్లు తింటే వచ్చే వ్యాధి అన్న అపోహలో కొందరున్నారు. మరికొందరు సెల్ఫ్ మెడికేషన్‌కు పరిమితమవుతున్నారు. మెడిసిన్ సిఫారసులు వైద్యులకు వదిలేయండి. అయితే జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ డయాబెటిస్ అసలే దరి చేరదని, ఇప్పటికే ఉన్నా అది నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గురుగ్రామ్‌లోని పరాస్ హాస్పిటల్స్ ఎండోక్రైనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అశుతోష్ గోయల్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డయాబెటిస్ పేషెంట్లకు పలు అమూల్యమైన సూచనలు చేశారు.

లైఫ్‌స్టైల్‌లో ఛేంజ్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు

హెల్త్ చెకప్ తప్పనిసరి

తరచుగా చెక్‌అప్ చేసుకోవడం తప్పనిసరి. మీ మెడికేషన్ ఛేంజ్ చేయాల్సిన అవసరం రావొచ్చు. పాత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా లేదా ఇతరులు వాడుతున్న మందుల ఆధారంగా మెడికల్ షాపులో కొని వాడకండి. ఇవి మేలు చేయడం కంటే కీడు ఎక్కువగా చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న మీ ఆరోగ్య పరీక్షలు, ప్రిస్కిప్షన్లతో ఒక ఫైలు తయారు చేసి పెట్టుకుని డాక్టర్‌ను సందర్శించిన ప్రతిసారి చూపిస్తే.. మీ ఆరోగ్యంపై వైద్యుడికి పూర్తి అవగాహన ఉంటుంది. డయాబెటిక్‌కు సంబంధించి మీకు ఏ మందులు సరిగ్గా పనిచేస్తున్నాయి? ఏవి పనిచేయడం లేదు అన్న విషయం డాక్టర్‌ విశ్లేషించుకోగలుగుతారు.

డైట్ చాలా ఇంపార్టెంట్

మేలు చేసే ఆహారం తీసుకోండి. మిమ్మల్ని బాగా నోరూరింపగలిగే ఆహార పదార్థాలను వదిలేయండి. ఆహారం కల్తీ అయ్యేందుకు ఆస్కారం ఉన్నవాటిని కూడా వదిలేయండి. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్, స్వీట్లు, కొర్బొనేటెడ్ డ్రింక్స్ జోలికి వెళ్లండి. అంటే దీనర్థం మీరు షుగర్ ఫ్రీ ఫుడ్ ఎంచుకోమని కాదు. ఇవి రుచికరంగా ఉండడానికి అధిక రసాయనాలు వాడతారని అర్థం. మీ డైట్‌లో సీజనల్ ఫ్రూట్స్, వెజిటెబుల్స్, సీడ్స్, డెయిరీ ప్రోడక్ట్స్, గింజధాన్యాలు చేర్చండి. అలాగే తగినంత నీరు తాగండి. బాడీ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తించండి.

వర్కవుట్స్ తప్పనిసరి

వర్కవుట్స్ తప్పనిసరి. అంటే జిమ్‌లో జాయిన్ అవడమో, లేక కఠిన వ్యాయామాలు చేయడమో కాదు. మీరు ఫిట్‌గా ఉండడానికి, మీ వెయిట్ తగ్గించుకోవడానికి అపరిమితమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయొచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మీ శరీరంలో మార్పులు గమనించవచ్చు.

స్ట్రెస్ మేనేజ్మెంట్ కీలకం

స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చాలా కీలకం. డయాబెటిస్ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, సీకేడీ, నరాల బలహీనత, కాలికి సమస్యలు, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఒత్తిడికి లోనైప్పుడు మీ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. అందువల్ల స్ట్రెస్ మేనేజ్ చేసేందుకు తగిన శ్రద్ధ పెట్టండి.

ఆల్కహాల్, స్మోకింగ్ అసలే వద్దు

ఆల్కహాల్, స్మోకింగ్‌కు ఇక బైబై చెప్పేయండి. బీర్, వైన్, లేక ఏదైనా లిక్కర్ మీరు తీసుకునే అలవాటు ఉంటే మీ దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా వాటిని పక్కన పెట్టేయండి. వాటిని పక్కన పెడితే మీ షుగర్ లెవెల్స్ మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయి. మీరు డయాబెటిక్ అయితే ఏ చెడు అలవాటు ఉన్నా మరిన్ని రిస్కులను పెంచుతుంది. ఒకటే సిగరెట్ కదా, ఒకే పెగ్గు కదా అన్న నిర్లక్ష్యం కూడా వద్దు.

డయాబెటిస్ భారత దేశానికి సవాలు విసురుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దేశ జనాభాలో దాదాపు 8.7 శాతం డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. పట్టణీకరణ, ఒత్తిడి, సెడెంటరీ లైఫ్‌స్టైల్, పొగ తాగడం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు ప్రజల్లో డయాబెటిస్‌ను పెంచుతున్నాయి.

వాయు కాలుష్యం, నీటి కాలుష్యం కూడా డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల మీ ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టండి.

టాపిక్

తదుపరి వ్యాసం