తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast: కడుపు నిండే పప్పు కుడుములు

breakfast: కడుపు నిండే పప్పు కుడుములు

11 May 2023, 6:30 IST

google News
  • breakfast: పప్పులో గోదుమపిండి కుడుములు వేస్తే మంచి అల్పాహారం సిద్దమవుతుంది. అదెలాగో చూడండి. 

పప్పు కుడుములు
పప్పు కుడుములు (freepik)

పప్పు కుడుములు

ఉదయాన్నే అల్పాహారం చేయడం, మధ్యాహ్నం మళ్లీ భోజనం లోకి ఇంకో కూర చేయడం అప్పుడప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ పప్పు కుడుములు చేసి చూడండి. అల్పాహారంతో పాటూ మధ్యాహ్న భోజనంలోకి పప్పు కూడా ఒకేసారి చేయడం అయిపోతుంది.

కావాల్సిన పదార్థాలు:

కందిపప్పు -కప్పు

చింతపండు- 100 గ్రాములు

గోదుమ పిండి- 250 గ్రాములు

ఉల్లిపాయలు -1 చిన్నది

టమాటా - 1 చిన్నది

పల్లీలు - 50 గ్రాములు

వెల్లుల్లి రెబ్బలు - 4

జీలకర్ర- అర టీస్పూన్

ఆవాలు - అర టీస్పూన్

కరివేపాకు- ఒక రెమ్మ

కొత్తిమీర -కొద్దిగా

పసుపు- టీస్పూన్

ఉప్పు - తగినంత

ధనియాల పొడి- అర టీస్పూను

జీలకర్ర పొడి- అర టీస్పూను

కారం- రెండు టేబుల్ స్పూన్లు

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

step 1: ముందుగా వెడల్పాటి పాత్రలో గోదుమపిండి, ఉప్పు వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి.

step 2: కుక్కర్ ‌లో నీళ్లు పోసి కందిపప్పు ఉడికించుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఇపుడు పప్పు తాలింపు కోసం పాత్ర పొయ్యి మీద పెట్టుకోవాలి.

step 3: పాత్రలో నూనె వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తరువాత పల్లీలు, ఎల్లిపాయలు, ఉల్లిపాయముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం రంగుమారాక టమాటా ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి.

step 4: టమాటా మగ్గాక పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులో మెత్తగా ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. నానబెట్టుకున్న చింత పండు రసం కూడా పోసుకోవాలి. కప్పు పప్పుకు 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి.

step 5: ఆలోపు తడుపుకున్న గోదుమ పిండిని చిన్న చిన్నగా గుండ్రని ముద్దలు చేసి, ఒత్తుకోవాలి. ఈ కుడుములను బాగా మసులుతున్న పప్పులో వేయాలి.

step 6: నీళ్లు ఎక్కువగా వేసుకుంటేనే ఈ కుడుములు ఉడుకుతాయి. కుడుములు ఉడికే లోపు పప్పు చిక్కబడిపోతుంది. అంతే ఈ కుడుములను కొంచెం పప్పుతో అల్పాహారంలోకి తినొచ్చు. అదే పప్పును అన్నంలోకి కూడా తినొచ్చు.

తదుపరి వ్యాసం