Capsicum Dum rice: క్యాప్సికం దమ్ రైస్, బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ ఘుమఘుమలాడిపోతుంది
13 September 2024, 11:30 IST
Capsicum Dum rice: క్యాప్సికంని ఇష్టపడని వారు ఒకసారి క్యాప్సికం దమ్ రైస్ తిని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.ఈ రెసిపీ కూడా చాలా సులువు. లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసేందుకు టేస్టీగా ఉంటుంది.
క్యాప్సికం రైస్
Capsicum Dum rice: క్యాప్సికం పేరు చెప్పగానే ఎక్కువమంది ముఖం తిప్పేసుకుంటారు. నిజానికి క్యాప్సికం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. దీంతో క్యాప్సికం రైస్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా చేస్తే పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. కారాన్ని తగ్గిస్తే పిల్లలు కూడా చక్కగా తింటారు. పైగా క్యాప్సికంలో ఉండే పోషకాలు మన శరీరానికి అవసరమైనవి కూడా. దాన్ని ఎలా చేయాలో ఇక్కడ మేము ఇచ్చాము. దీన్ని ఫాలో అయి ఒకసారి ప్రయత్నించండి మీకు నచ్చడం ఖాయం.
క్యాప్సికం దమ్ రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
క్యాప్సికమ్ - మూడు
వండిన అన్నం - రెండు కప్పులు
నూనె - తగినంత
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - అర స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఎండుమిర్చి - రెండు
ధనియాలు - రెండు స్పూన్లు
శనగపప్పు - మూడు స్పూన్లు
మిరియాల పొడి - చిటికెడు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - మూడు
ఉల్లిపాయ - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
ఉప్పు - రుచికి సరిపడా
క్యాప్సికం దమ్ రైస్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి లవంగాలు, దాల్చిన చెక్క, శనగపప్పు వేసి వేయించాలి.
2. అందులోనే ధనియాలు వేసి వేయించుకోవాలి. అలాగే జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి.
3. వీటన్నింటిని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
6. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, క్యాప్సికం కూడా వేసి వేయించుకోవాలి.
7. పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
9. క్యాప్సికం ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
10. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి బాగా కలపాలి.
11. ఇందులో వండిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి.
12. అలాగే కరివేపాకులను కూడా చల్లుకోవాలి.
13. పైన మూత పెట్టి చిన్న మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత స్టవ్ కట్టేయాలి.
14. అంతే టేస్టీ క్యాప్సికం దమ్ రైస్ రెడీ అయినట్టే.
దీన్ని వండిన అన్నంతో చేస్తాం కాబట్టి చాలా సులువుగా అయిపోతుంది. తక్కువ సమయంలోనే ఈ రైస్ రెడీ అయిపోతుంది. క్యాప్సికంలో పెట్టుకొని పొటాషియం, ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదాల నుండి కాపాడతాయి. కాబట్టి క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
టాపిక్