Health Tips : శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగించే పానీయాలు!
04 July 2022, 21:10 IST
- Health Tips :అనేక అనారోగ్య సమస్యలను నివారించటంలో పరగడుపున సేవించే కొన్ని పానీయాలు సహకరిస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శరీరంలోని మలినాలు తొలిగిపోవాలంటే దాల్చిన, చెక్క, తేనె పానీయంతో పాటు మిరియాలు, దోసకాయ పానీయం తాగాలని సూచిస్తున్నారు
Body Detox
అనిశ్చిత జీవన శైలి, అధిక కొలెస్ట్రాల్(fat)తో కూడిన ఆహారాలను తీసుకోవడం కారణంగా శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ఎన్నో రకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. ఊబకాయం (Obesity) , ఉదర సమస్యలు (stomach problems), అధిక రక్తపోటు (high blood pressure) వంటి సర్వ సాధరణంగా మారిపోయాయి. ఈ సమస్యలను తొలిగిపోవాలంటే బాడీ డిటాక్స్ చేయడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. శరీరంలోని మలినాలను తొలిగించడానికి నిపుణులు కొన్ని వంటింట్లో ఆరోగ్య చిట్కాలను సిఫార్సు చేస్తు్న్నారు. వీటిని రోజు తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం తలెత్తదని అంటున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.
దాల్చిన చెక్క, తేనె పానీయం - దాల్చిన చెక్క, తేనె శరీరంలోని మలినాలను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్., యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
మిరియాలు, దోసకాయ పానీయం -మిరియాలు, దోసకాయ పానీయాలు శరీరంలోని మలినాలను శుభ్రపరుస్తాయి. దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అలాంటప్పుడు, ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే వీటికి పుదీనా ఆకులు యాడ్ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పుదీనా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి.
దేహంలో రక్తప్రసరణ సరిగ్గా జరగాలంటే మలినాలు తొలిగిపోవాలి. జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాలు కాకుండా ఫైబర్, ప్రోటిన్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
టాపిక్