తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Tea Benefits : బరువు తగ్గాలనుకుంటే.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్​

Black Tea Benefits : బరువు తగ్గాలనుకుంటే.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్​

22 June 2022, 8:31 IST

google News
    • బ్లాక్​ టీని ప్రపంచలోనే అత్యంత గుర్తింపు పొందిన, వినియోగించే టీలలో ఒకటి. ఈ టీ చైనా, భారతదేశంలో ఉద్భవించింది. అయితే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్​లో దీనిని కలిపి తీసుకోవచ్చు అంటున్నారు.  
బ్లాక్ టీ
బ్లాక్ టీ

బ్లాక్ టీ

Black Tea Benefits : బరువు తగ్గడానికి మీరు మార్కెట్లో అనేక రకాల టీలను వెతుక్కుంటారు. అయితే వాటిన్నింటికి బదులు బ్లాక్ టీ ఉత్తమమైనది అంటున్నారు నిపుణులు. బ్లాక్ టీలో పాలు, చక్కెర లేకుండా తీసుకుంటారు. కొంత మంది ఇందులో నేచురల్ స్వీటెనర్ వాడుతున్నారు. అయితే చాలా మంది బరువు తగ్గడం కోసం దీన్ని తాగుతుంటారు. అయితే  బ్లాక్ టీతో బరువు తగ్గడమే కాదు.. చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1) యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

బ్లాక్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి గ్రీన్, బ్లాక్ టీల పొడి బరువులో 30% వరకు ఉంటాయి. ఈ విధంగా బ్లాక్ టీ ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి, శరీరంలోని దెబ్బతిన్న కణాలను తగ్గించడంలో, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

2) జుట్టు, చర్మ సంరక్షణకై

బ్లాక్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఫైటోన్యూట్రియెంట్లు శరీరంలోని టాక్సిన్స్​ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. ఇది శరీరం చర్మ ఇన్ఫెక్షన్లు, మచ్చలతో పోరాడటానికి సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలను, వాపును తగ్గిస్తుంది.

3) గుండె ఆరోగ్యానికి మంచిది

బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీన్ని రోజూ తాగడం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి గుండె జబ్బులకు సంబంధించిన అనేక ప్రమాద కారకాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉండి.. గట్ బ్యాక్టీరియాను చంపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

4) ఏకాగ్రతను పెంచుతుంది

బ్లాక్ టీలో కెఫీన్, ఎల్-థియనైన్ అనే ఒక రకమైన అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శక్తిని, దృష్టిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఎల్-థియానైన్, కెఫిన్ కలిగిన పానీయాలు మెదడులో ఆల్ఫా కార్యకలాపాలను పెంచుతాయి. ఇవి ఏకాగ్రతను పెంచుతాయి.

మరిన్ని వివరాలు..

* రోజూ బ్లాక్ టీ తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనిని మితంగా తీసుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారు రోజుకు మూడు నుంచి ఐదు కప్పుల బ్లాక్ టీ తాగడం సరైనది అంటున్నారు నిపుణులు. 

* ఆహారం జీర్ణం కావడానికి బ్లాక్ టీ మంచిది. అల్పాహారం, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఒక కప్పు బ్లాక్ టీ తాగడాన్ని సిఫార్సు చేస్తున్నారు. 

* బ్లాక్ టీలో అత్యధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. ఎక్కువ కెఫిన్ అంటే శక్తిని పెంచడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. 

టాపిక్

తదుపరి వ్యాసం