BHEL Recruitment 2022: BHELలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!
20 June 2022, 18:43 IST
- BHEL Recruitment 2022:: భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
BHEL Recruitment 2022
BHEL రిక్రూట్మెంట్ 2022: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు 21 జూన్ 2022 వరకు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 184 అప్రెంటిస్ పోస్ట్‌లను రిక్రూట్ చేయనున్నారు.
ఉద్యోగాలు
ఫిట్టర్ - 65,
టర్నర్ - 19,
మెషినిస్ట్ - 43,
వెల్డర్ - 20,
ఎలక్ట్రీషియన్ - 26
డ్రాఫ్ట్స్‌మెన్ - 2
ఎలక్ట్రానిక్స్ -1
మోటర్ మెకానిక్ వెహికల్ - 1,
కార్పెంటర్ - 1
Foundry man - 6
అర్హత: ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, NCVT ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో ITI కలిగి ఉండాలి.
వయస్సు: అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు పొందుతారు. వివరణాత్మక సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.
అభ్యర్థులు వ్రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఈ రిక్రూట్మెంట్ పరీక్ష 6 ఆగస్టు 2022న నిర్వహించే అవకాశం ఉంది. అర్హత గల అభ్యర్థులు 21 జూన్ 2022లోపు అధికారిక వెబ్సైట్ apprenticeshipindia.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
టాపిక్