తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సహజ సిద్ధమైన అందాలు.. ప్రకృతి ప్రేమికులు పులకించే ప్రాంతాలు

సహజ సిద్ధమైన అందాలు.. ప్రకృతి ప్రేమికులు పులకించే ప్రాంతాలు

28 February 2022, 17:22 IST

google News
    • కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు ప్రకృతి సోయగాల మధ్య కాస్త సేద తీరాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి వారి కోసం మన దేశంలో ఎన్నో ప్రకృతి అందాలు రారామంటున్నాయి. సహజ సిద్ధమైన అందాలతో బాసిల్లుతున్న ఆ ప్రదేశాలు పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని ఇస్తున్నాయి.
రావంగ్లాలోని బుద్ధ పార్క్
రావంగ్లాలోని బుద్ధ పార్క్

రావంగ్లాలోని బుద్ధ పార్క్

రణగొణ ధ్వనుల మధ్య సతమతమయ్యే నగర జీవులు కాస్త విరామం దొరికితే రెక్కలు కట్టుకుని ఎక్కడికైనా ఎగిరిపోవాలని ఉబలాటపడుతున్నారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే ప్రదేశాలకు వెళ్లండి. మీరు కచ్చితంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు.

1. ఐజ్వాల్ (మిజోరం)- భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఐజ్వాల్ ఒకటి. తక్కువ ఖర్చులో ఇక్కడి అందమైన ప్రదేశాలను సందర్శించి ఆనందించవచ్చు.  ఖవాంగ్లాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం, వంత్వాంగ్ జలపాతాలు, టామ్‌డిల్ సరస్సు, బుర్రా బజార్, మిజోరం స్టేట్ మ్యూజియం, డర్ట్‌లాంగ్ హిల్స్, రెయిక్ హెరిటేజ్ విలేజ్ ఐజ్వాల్‌లో చూడదగిన ప్రదేశాలు.

2. కోయంబత్తూర్ (తమిళనాడు) - కోయంబత్తూరు.. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరుగాంచిన ఈ ప్రాంతం అనేక ప్రకృతి అందాలకు నెలవు. ఈ అందమైన ప్రదేశంలో పర్యాటకులు ఆనందించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో పశ్చిమ కనుమలపై దాదాపు 500 అడుగుల ఎత్తులో ఉన్న మరుధమలై ఆలయం ప్రముఖమైనది. ఆలయంలో ద్రవిడ శిల్పకళ ఉట్టిపడుతుంది. అలాగే కోయంబత్తూర్‌లోని ఆదియోగి శివ విగ్రహం, వైదేహి జలపాతం, కోవై కొండట్టం, పేరూర్ పటేశ్వరార్ ఆలయం, సిరువాణి జలపాతాలు వంటి ప్రదేశాలను టూరిస్ట్‌లు ఆస్వాదించవచ్చు.

3. అమరావతి (ఆంధ్రప్రదేశ్) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అమరావతి ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణ. ఈ నగరం పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. అమరావతిలో మీరు హరికేన్ పాయింట్, భీమ్ కుండ్, అంబాదేవి టెంపుల్, ఛత్రీ తలాబ్, వడాలి తలాబ్, సతీధామ్ టెంపుల్ వంటి అందమైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు. బౌద్ధ,హిందు సంస్కృతితో ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడే ఈ ప్రాంతం పర్యాటకులలో భక్తి భావాన్ని నింపుతుంది.

4. దావణగెరె (కర్ణాటక)- కర్ణాటకలోని దావణగెరె సహజమైన ప్రకృతి అందాలకు నెలవు. ఇది దేశంలో అత్యధిక మంది పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలలో ఒకటి. కుందువాడ కెరె, ఈశ్వర్ మందిర్, బతి గుడ్డ, బేతూర్, బాగ్లీ వంటి పర్యాటక ప్రదేశాలను మీరు ఆస్వాదించవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ నగరం ప్రసిద్ధి చెందింది. హరిహరేశ్వర ఆలయం, తీర్థరామేశ్వర ఆలయం, కాళేశ్వర ఆలయం, రాజనహళ్లి.. ఇక్కడ ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు.

5. విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)- ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ప్రకృతి సోయగాల ప్రసిద్ధ నగరం. బీచ్‌లు, పార్కులు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, కటికి జలపాతాలు, బొర్రా గుహలు, INS కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, రుషికొండ బీచ్, అరకు వ్యాలీ, వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం వంటి అద్భుతమైన పర్యాటక ఆకర్షణలకు నగరం ప్రసిద్ధి చెందింది.

తదుపరి వ్యాసం