తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Road Trips | రోడ్​ట్రిప్​కు వెళ్తున్నారా? అయితే ఇవే బెస్ట్.. ట్రై చేయండి..

Best Road Trips | రోడ్​ట్రిప్​కు వెళ్తున్నారా? అయితే ఇవే బెస్ట్.. ట్రై చేయండి..

HT Telugu Desk HT Telugu

27 May 2022, 12:44 IST

google News
    • రోడ్ ట్రిప్​కు వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే బైక్​ ట్రిప్​ అయితే అస్సలు చెప్పనవసరంలేదు. అది ఇచ్చే అనుభూతి చాలా ప్రత్యేకమైనది. మీరు కూడా బైక్​ రైడ్​ను ఇష్టపడేవారైతే.. ఈ ట్రిప్స్​కి బైక్​ మీద వెళ్లండి. మధురమైన అనుభవాలు పొంది.. మదిలో దాచుకోండి. నేషనల్ రోడ్​ట్రిప్ డే రోజు మీరు ఈ ప్రాంతాలను మీ బుక్​ లిస్ట్​లో చేర్చుకోండి.
రోడ్ ట్రిప్స్
రోడ్ ట్రిప్స్

రోడ్ ట్రిప్స్

Best Road Trips in India |

సిమ్లా నుంచి స్పితీ వ్యాలీ వరకు

సిమ్లా నుంచి హిమాచల్ ప్రదేశ్​లోని స్పితి వ్యాలీకి బైక్ మీద రోడ్ ట్రిప్‌కి వెళ్తే.. ఆహా మీ జన్మ ధన్యం అనిపించవచ్చు. అంతటి అద్భుతమైన లోకేషన్లు అక్కడ ఉంటాయి. మంచుతో కప్పబడిన శిఖరాలు, జలపాతాలు, కనుమలు, స్పితి వ్యాలీ అందాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఇరుకైన పర్వత రహదారులు, పదునైన వంపులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. రాతి భూభాగం కాబట్టి.. రైడ్ కాస్త డేంజర్​ ఉంటుంది. అయినా ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకునే వారి ఈ సవాళ్లు పెద్ద కష్టమేమి కాదు.

బెంగళూరు నుంచి కన్నూర్

మోటర్ సైకిల్ ఔత్సాహికులు.. బెంగుళూరు నుంచి కన్నూర్ వరకు రోడ్డు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ మార్గంలో ఉన్న సుందరమైన ప్రకృతి దృశ్యం.. మిమ్మల్ని నిజంగా మంత్రముగ్దులను చేస్తుంది. అదనంగా దారిలో అనేక సరస్సులు ఉంటాయి. స్థానిక రెస్టారెంట్‌లలో రుచికరమైన భోజనం కూడా లభిస్తుంది.

ముంబై టూ త్రివేండ్రం

రోడ్​ ట్రిప్స్​లలో ముంబై నుంచి త్రివేండ్రం బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది ప్రజాధారణ పొందలేదు కానీ.. ఇది రైడర్‌కు అత్యంత అద్భుతమైన అనుభవాలను అందిస్తుంది. ఈ రైడ్​లో మీరు పశ్చిమ కనుమలలోని పచ్చని కొండల అసమానమైన అందాలను అనుభవించవచ్చు. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు రైడర్లు గోవాలో కూడా ఆగవచ్చు.

దిల్లీ నుంచి లేహ్ వరకు

దేశంలోని బైక్ రోడ్ ట్రిప్​లలో ఇది అత్యంత ప్రసిద్ధ మార్గాలలో ఒకటి. దిల్లీ నుంచి లేహ్‌కు రోడ్డు ప్రయాణం అనేది ఏ మోటార్ సైకిల్ ఔత్సాహికులకైనా.. అంతిమ అనుభవంగా మిగులుతుంది. ఈ ట్రిప్ మొత్తం సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. అత్యుత్తమైన బైకర్లకు కూడా భారీ సవాళ్లను ఇస్తుంది. లేహ్ అత్యంత అద్భుతమైన ల్యాండ్‌స్కేప్‌ని కలిగి ఉంది. స్టార్‌గేజింగ్‌ను ఇష్టపడే ఎవరైనా ఇక్కడకు వెళ్లొచ్చు. ఈ రోడ్డు ప్రయాణంలో.. మీరు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ పాస్ అయిన ఖర్దుంగ్​లా గుండా వెళ్తారు.

చెన్నై నుంచి పాండిచ్చేరి

ఇది ఒక చిన్న బైక్ రోడ్ ట్రిప్ అయినప్పటికీ.. ఇది మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తుంది. చెన్నై నుంచి పాండిచ్చేరికి బైక్ రోడ్ ట్రిప్ ఈస్ట్ కోస్ట్ రోడ్ వెంట బీచ్‌ల అద్భుతమైన దృశ్యాలు మిమ్మల్ని కనువిందు చేస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం