తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walnut Benefits: జ్ఞాపక శక్తిని పెంచే వాల్‌నట్స్.. ఇలా తింటే మంచిది

walnut benefits: జ్ఞాపక శక్తిని పెంచే వాల్‌నట్స్.. ఇలా తింటే మంచిది

01 May 2023, 13:40 IST

google News
  • walnut benefits:  వాల్‌నట్స్ ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం, ఆహారం జీర్ణం అవ్వడంలో, రక్తపోటు నియంత్రణలో సాయపడుతుంది. 

     

వాల్ నట్స్
వాల్ నట్స్ (Unsplash)

వాల్ నట్స్

వాల్‌నట్ చూడటానికి మెదడు లాగా, అదే ఆకారంలో అనిపిస్తుంది. అంతేకాదు మెదడుకు మేలు చేస్తుంది కూడా. తాజాగా చేసిన ఒక సర్వేలో వారానికి కనీసం మూడు రోజులు గుప్పెడు వాట్‌నట్స్ తినే అబ్బాయిలూ, అబ్బాయిల్లో తెలివితేటలు, సమస్యలు పరిష్కిరంచే గుణం పెరుగుతుందని తేలింది.

ప్రతి మనిషికి ఎంతో అవసరమైన కాగ్నిటివ్ అబీలిటీని పెంచుతాయివి. ఈరోజుల్లో ఉద్యోగాలకు, పోటీపరీక్షలకు అవసరమైన లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, తార్కిక ప్రశ్నలను పరిష్కరించడానికి అవసరమయ్యే సామర్థ్యం ఇది. అల్జీమర్స్ రాకుండా కూడా వాల్‌నట్స్ తోడ్పడతాయి. చిన్న పిల్లల నుంచి , పెద్దల వరకు జ్ఞాపక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వీటిని తినడానికి సరైన సమయం ఏది? ఎలా తినొచ్చు?

రాత్రి పూట వాల్‌నట్స్ నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. దానివల్ల సులువుగా జీర్ణం అవుతాయి, మన శరీరం ఎక్కువ పోషకాలు గ్రహించగలుగుతుంది. సలాడ్లు, చట్నీలు, మిల్క్ షేక్‌లు, స్వీట్స్, ఐస్‌క్రీమ్ లలో వీటిని వేసుకోవచ్చు. వీటిని ఉదయాన్నే పరిగడుపున తీసుకుంటే మంచిది.

లాభాలు:

మెదడు ఆరోగ్యానికే కాకుండా.. ప్రేగు ఆరోగ్యానికి కూడా మంచిది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులను, టైప్ 2 మధుమేహం, క్యాన్సర్ రాకుండా రక్షిస్తాయి.

  1. వాపు తగ్గిస్తుంది: హృదయ సంబంధిత వ్యాధులకు, అల్జీమర్స్, టైప్ 2 మధుమేహం, క్యాన్సర్ లాంటి వాటికి వాపు కారణం. వాల్‌నట్స్ లో పాలీఫినాల్స్ ఉండటం వల్ల ఈ సమస్య రాకుండా కాపాడతాయి.
  2. పేగు ఆరోగ్యం: శరీర ఆరోగ్యానికి పేగు ఆరోగ్యం ముఖ్యం. మన శరీరం నుంచి వ్యర్థాలు సరిగ్గా బయటకు వెళ్లిపోతే శరీర వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉండటంతో పాటూ, మెదడు కూడా చురుగ్గా ఉంటుంది.
  3. బరువు తగ్గడంలో: నానబెట్టిన ఈ ఎండుఫలాల్ని తరచూ తీసుకోవడం వల్ల మన మెదడులో ఆహారం తినాలనే కోరికను తగ్గించే లక్షణాల మీద పనిచేస్తుంది. దానివల్ల తరచూ ఆకలి కాకుండా ఉండటంతో బరువు తగ్గుతారు.
  4. రక్తపోటు తగ్గించడం: అధిక రక్తపోటు మంచిది కాదు. దానివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల బీపీ తగ్గుతుంది.
  5. అల్జీమర్స్ : జ్ఞాపక శక్తి తగ్గించే ఈ వ్యాధి రాకుండా ఈ ఎండుఫలం కాపాడుతుంది. ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది. ఏదైనా కొత్త పని సులభంగా నేర్చుకోగలుగుతారు, సమస్యలు పరిష్కరించే గుణం పెరుగుతుంది.

తదుపరి వ్యాసం