పిల్లలకు జంక్ ఫుడ్‌కు బదులుగా ఈ సూప్ తాగించండి!
28 February 2022, 17:50 IST
- రంగులు పూసి, నిషేధిత పదార్థాలతో తయారు చేసిన జంక్ ఫుడ్‌ను తక్కువ ధరకు అమ్ముతూ పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొందరు వ్యాపారులు. ఇంతటి ప్రభావాన్ని చూపే చిరు తిండ్లను మాన్పించి.. వాటికి బదులు చక్కగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి పిల్లలకు అలవాటు చేయడం మంచిది.
beetroot-soup
భారతీయుల ఆహర విధానంలో తేడాలు వస్తున్నాయి. జంక్ ఫుడ్ సంస్కృతి దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ పాశ్చాత్య ఆహారానికి అలవాటు పడుతున్నారు. ఇదే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు అదే పనిగా జంక్ ఫుడ్‌కు అలవాటు పడిపోయారు. తల్లిదండ్రులు వద్దంటే మారం చేసి మరీ సాధించుకుంటున్నారు. చిరు తిండ్లు ఇప్పించేంత వరకు వదలడం లేదు. చిన్నారుల చిరు తిండ్లు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
రంగులు పూసి, నిషేధిత పదార్థాలతో తయారు చేసిన జంక్ ఫుడ్‌ను తక్కువ ధరకు ఆమ్ముతూ పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వాతావరణ మార్పులకు అణుగుణంగా వారికి ఆహారాన్ని ఇవ్వాలి. మారుతున్న సీజన్ కారణంగా వారి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను వారి డైట్ ప్లాన్‌లో చేర్చాలి. అలాంటి వాటిలో మెుదటిది బీట్‌రూట్.
బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ ఎ, బి, సి, కె, ఇ పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వాటితో పాటు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ పిల్లల్లోని రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఫైబర్ అప్పుడప్పుడే బలపడుతున్న పిల్లల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో పిల్లలకు బీట్‌రూట్ సూప్ తాగించడం ద్వారా సీజన్‌లో వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు.
అయితే ఇంత మంచి అరోగ్య ప్రయోజనాలు ఉన్న బీట్‌రూట్ సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
బీట్ సూప్ తయారీకి కావలసినవి:
- 2 వెల్లుల్లి రెబ్బలు తరిగినవి
- 1 క్యారెట్
- 1 బీట్‌రూట్ - ఎండుమిర్చి
- నల్ల ఉప్పు
- నెయ్యి
తయారు చేసుకునే విధానం:
బీట్‌రూట్ సూప్ చేసే తయారు చేసే విధానం- బీట్‌రూట్ సూప్ చేయడానికి ముందుగా క్యారెట్, బీట్‌రూట్‌లను శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత, ఉడకబెట్టడానికి గ్యాస్ మీద వెల్లుల్లి, క్యారెట్,దుంపలను ఉంచండి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత వాటిని గ్రైండర్ లేదా బ్లెండర్‌లో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రను తీసుకుని అందులో నెయ్యి వేయాలి.
దానికి కొద్దిగా జీలకర్ర పొడి వేసి, ఆపై మిక్స్ చేసిన క్యారెట్, దుంప పేస్ట్‌ను జోడించండి. ఇప్పుడు అందులో కొన్ని నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. ఇది ఉడికిన తర్వాత, దానికి నల్ల ఉప్పు, ఎండుమిర్చి వేసి, మరికొంత సేపు ఉడికించండి. ఇప్పుడు ఇక మీ బీట్‌రూట్ సూప్ సిద్ధం.