Saddula Bathukamma Wishes : సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. ఇలా చెప్పేసేయండి
21 October 2023, 16:12 IST
- Saddula Bathukamma Wishes 2023 : బతుకమ్మ పండగ అంటే తెలంగాణ సంస్కృతి. పూలను పూజించే ఇలాంటి గొప్ప పండుగ ప్రపంచంలో మరెక్కడా లేదు. చివరి రోజు సద్దుల బతుకమ్మను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటారు. మీ బంధు మిత్రులకు ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి.
బతుకమ్మ పండగ
భగవంతుడిని పూలతో పూజిస్తాం. అదే పూలను కొలిచే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతం. పువ్వులను భగవంతుడిగా కొలుస్తూ.. తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు బతుకమ్మ పండుగను గొప్పగా చేసుకుంటారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి.. అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ.. ఏ ఊరు చూసినా సంబరాల్లో మునిగిపోతుంది. సద్దుల బతుకమ్మ సందర్భంగా మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలపండి.
తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆటపాటలు, కోలాటాలతో ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా.. మన ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు..
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు..
తెలంగాణ ఆచార, సంప్రదాయాలకు ప్రతీక.. మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక.. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
పువ్వులను పూజించే మన ఆడపడుచులు.. మా ఇంటికి మీరే మహారాణులు.. బతుకమ్మ శుభాకాంక్షలు
బతుకమ్మలోని పువ్వులు.. మా ఇంటి మహాలక్ష్మి నవ్వులు.. మళ్లీ మళ్లీ చూడాలంటున్నాయి కనులు.. బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి.. లోకమంతా తిరిగే బతుకమ్మ పండుగను మీరు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు..
పూలను పూజించే.. ప్రకృతిని ఆరాధించే ఆడబిడ్డల పూల పండుగ మన బతుకమ్మ వేడుక. ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు..
తెలంగాణ సంప్రదాయాలు, ఆచారాలు చాటి చెప్పే పండుగ బతుకమ్మ.. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు
పూలను పూజించడం ఓ గొప్ప సంప్రదాయం.. అది తెలంగాణకు మాత్రమే సొంతం.. బతుకమ్మ శుభాకాంక్షలు..
భగవుతుండిని పూజించే.. పూలనే.. భగవంతుడిగా కొలిచే గొప్ప సంస్కృతి మన సొంతం.. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు
తంగేడు పువ్వులు.. ఆడపడుచుల నవ్వులు.. ఇవే బతుకమ్మ పండుగలో సిరులు.. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే గౌరమ్మ..
తంగేడు పువ్వోప్పునే గౌరమ్మ.. తంగేడు కాయెుప్పునే గౌరమ్మ..
అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే వినిపిస్తున్నాయి. తొమ్మిది రోజులు జరిగే బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. చివరిరోజు సద్దుల బతుకమ్మ.. సందడి అంతా ఆ రోజే కనిపిస్తుంది. సద్దుల బతుకమ్మ నాడు బతుకమ్మలు పెద్దగా పేరుస్తారు. తెచ్చిన పూలను జాగ్రత్తగా తాంబలంలో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. మెుదట తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో పెడతారు. అనంతరం తంగేడు పూలను ఒక్కటొక్కటిగా పేరుస్తారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను కూడా పెడతారు. తెల్లని గునుక పూలకు రంగులు అద్దుతారు.
బతుకమ్మను పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి తర్వాత బతుకమ్మను తీసుకెళ్లి ఇంట్లోని దేవుడిని కొలిచే ప్రదేశంలో పెడతారు. కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజ చేస్తారు. సాయంత్రం పూట ఊరంతా ఒక్కసారిగా కదులుతుంది. అంతా సాయంకాలం బతకమ్మలతో ఒక చోటకు చేరుతారు. వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ పాడుతారు
సద్దుల బతుకమ్మ రోజు ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి. సద్దుల బతుకమ్మతో సాయంత్రం ముగింపు. బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడిలో వదిలిపెట్టి మళ్లీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూస్తారు.