తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bathukamma Songs Lyrics : ఒక్కేసి పువ్వేసి చందమామా.. అవ్వ చెప్పిన పూర్తి బతుకమ్మ పాట

Bathukamma Songs Lyrics : ఒక్కేసి పువ్వేసి చందమామా.. అవ్వ చెప్పిన పూర్తి బతుకమ్మ పాట

Anand Sai HT Telugu

09 October 2023, 9:30 IST

google News
    • Bathukamma Songs Telugu : తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ సందర్భంగా ఆడపడచులు పాడే పాటలు ఎంతో మధురంగా ఉంటాయి. తాత ముత్తాతల కాలం నుంచి పాడుతున్న పాటలను HT Telugu మీకు అందించేందుకు సేకరిస్తోంది.
బతుకమ్మ పాట
బతుకమ్మ పాట (Facebook)

బతుకమ్మ పాట

ముందు తరాలకు చెబితేనే చరిత్రకు జీవం ఉంటుంది. లేదంటే.. ప్రకృతిలో కలిసిపోతుంది. సంస్కృతి, పాటలు కూడా అంతే. భవిష్యత్ తరాలకు చెబితేనే.. ముందుకు సాగుతాయి. ఇప్పుడున్న తరం.. ముందు తరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎప్పటి నుంచో పాడుతున్న బతుకమ్మ పాటలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పాటలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్కోలా పాడుతుంటారు. అందులో భాగంగా.. పెద్దపల్లి జిల్లా గూడెం గ్రామానికి చెందిన కర్ర లచ్చవ్వతో HT Telugu మాట్లాడింది. ఆమె పాడిన బతుకమ్మ పాట మీకోసం..

ఒక్కేసి పువ్వేసి చందమామా..

ఒక్క జాము ఆయె చందమామా..

కింద ఇల్లు కట్టి చందమామా..

పైన మఠం కట్టి చందమామా..

మఠంలో ఉన్న చందమామా..

మాయదారి శివుడు చందమామా..

శివపూజ వేళాయె చందమామా..

శివుడు రాకపాయె చందమామా..

గౌరి గద్దెల మీద చందమామా..

జంగమయ్య ఉన్నాడె చందమామా..

రెండేసి పూలేసి చందమామా..

రెండు జాములయె చందమామా..

శివపూజ వేళాయె చందమామా..

శివుడు రాకపాయె చందమామా..

మూడేసి పూలేసి చందమామా..

మూడు జాములాయె చందమామా..

శివపూజ వేళాయె చందమామా..

శివుడు రాకపాయె చందమామా..

నాలుగేసి పూలేసి చందమామా..

నాలుగు జాములాయె చందమామా..

శివపూజ వేళాయె చందమామా..

శివుడేలా రాకపాయె చందమామా..

ఐదేసి పూలేసి చందమామా..

ఐదు జాములాయె చందమామా..

శివపూజ వేళాయె చందమామా..

శివుడు రాకపాయె చందమామా..

ఆరేసి పూలేసి చందమామా..

ఆరు జాములాయె చందమామా..

శివపూజ వేళాయె చందమామా..

శివుడు రాకపాయె చందమామా..

ఏడేసి పూలేసి చందమామా..

ఏడు జాములయె చందమామా..

శివపూజ వేళాయె చందమామా..

శివుడు రాకపాయె చందమామా..

ఎనిమిదేసి పూలేసి చందమామా..

ఎనిమిది జాములాయె చందమామా..

శివపూజ వేళాయె చందమామా..

శివుడు రాకపాయె చందమామా..

తొమ్మిదేసి పూలేసి చందమామా..

తొమ్మిది జాములాయె చందమామా..

శివపూజ వేళాయె చందమామా..

శివుడు రాకపాయె చందమామా..

తంగేడు వనములను చందమామా..

తాళ్లు కట్టబోతిరి చందమామా..

గుమ్మాడి వనమునకు చందమామా..

గుడి కట్టబోయే చందమామా..

రుద్రాక్ష వనమునకు చందమామా..

నిద్ర చేయపోయె చందమామా..

నీనోము నీకిత్తునే గౌరమ్మ..

నా నోము నాకియ్యవే గౌరమ్మ..

సేకరణ : HT Telugu

తదుపరి వ్యాసం