Bathukamma songs: ఇసుకల పుట్టె గౌరమ్మ ఇసుకలో పెరిగే గౌరమ్మ.. బతుకమ్మను సాగనంపే పాట పూర్తి లిరిక్స్..
22 October 2023, 16:20 IST
Bathukamma songs: బతుకమ్మను సాగనంపే పాట.. “పోయిరా గౌరమ్మ..” పాట పూర్తి లిరిక్స్ మీకోసం HT తెలుగు సేకరించింది. మీరూ చూసేయండి.
బతుకమ్మ పాటలు
బతుకమ్మ పాటలు ఒక్కో సందర్భానికి ఒక్కోటి ఉంటాయి. కొన్ని బతుకమ్మకు ఆహ్వానం పలికే పాటలు, మరికొన్ని పండగ గొప్పతనం తెలిపే పాటలు, కొన్ని ఆచారాలు తెలిపితే మరికొన్ని పాటలు బతుకమ్మ పూల గొప్పతనాన్ని చెబుతాయి. అలాగే బతుకమ్మను సాగనంపే పాట కూడా ఉంది. ఆ పాట పూర్తి లిరిక్స్ మీకోసం..
బతుకమ్మను సాగనంపే పాట లిరిక్స్:
ఇసుకల పుట్టె గౌరమ్మ ఇసుకలో పెరిగే గౌరమ్మ ..
ఇసుకలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ..
తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు..
పోగలవంటి వనములు..
వనముల చిలుకలు గలగల పలికితె..
వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె..
పసుపులో పుట్టె గౌరమ్మ పసుపులో పెరగే గౌరమ్మ ..
పసుపులో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ..
తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు..
పోగలవంటి వనములు..
వనముల చిలుకలు గలగల పలికితె..
వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె..
కుంకుమలో పుట్టె గౌరమ్మ కుంకుమలో పెరిగే గౌరమ్మ..
కుంకుమలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ..
తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు..
పోగలవంటి వనములు..
వనముల చిలుకలు గలగల పలికితె..
వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె..
గంధంలో పుట్టె గౌరమ్మ గంధంలో పెరిగే గౌరమ్మ ..
గంధంలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ..
తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు..
పోగలవంటి వనములు..
వనముల చిలుకలు గలగల పలికితె..
వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలే..
సేకరణ: HT తెలుగు