తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Corn Pulao: బేబీకార్న్ పులావ్.. పదినిమిషాల్లో సిద్ధం..

Baby corn pulao: బేబీకార్న్ పులావ్.. పదినిమిషాల్లో సిద్ధం..

HT Telugu Desk HT Telugu

30 July 2023, 13:13 IST

google News
  • Baby corn pulao: బేబీకార్న్, పుట్టగొడుగులతో కలిపి రుచిగా ఉండే బేబీకార్న్ పులావ్ ఎలా తయారుచేసుకోవాలో చూసేయండి.

బేబీ కార్న్ పులావ్
బేబీ కార్న్ పులావ్ (slurrp)

బేబీ కార్న్ పులావ్

మధ్యాహ్నం పూట బిర్యానీకి బదులుగా ఏదైనా రుచికరమైన పులావ్ చేసుకోవాలి అనుకుంటున్నారా?. అయితే బేబీకార్న్, పుట్టగొడుగులతో చేసే పులావ్ రుచి బిర్యానీని మించిపోతుంది. ఒక్కసారి దీన్ని ప్రయత్నించి చూడండి. పొట్టకు కూడా తేలికగా ఉంటుంది. కడుపునిండా తినేస్తారు కూడా. దాని తయారీ ఎలాగో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు బాస్మతీ బియ్యం

150 గ్రాముల బేబీ కార్న్

100 గ్రాముల పుట్ట గొడుగులు

1 ఉల్లిపాయ

పావు కప్పు పుదీనా ఆకులు

1 పచ్చిమిర్చి

1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

పావు చెంచా పసుపు

సగం చెంచా మిరియాల పొడి

1 చెంచా కారం

1 బిర్యానీ ఆకు

తగినంత ఉప్పు

2 చెంచాల నూనె

2 చెంచాల నెయ్యి

తయారీ విధానం:

  1. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా, సన్నగా కట్ చేసుకోవాలి. పుట్టగొడుగుల్ని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. బేబీకార్న్‌ మధ్యలోకి కోసుకుని, అంగుళం ముక్కలుగా కోసుకోవాలి. బియ్యం కడుక్కుని అరగంట నానబెట్టుకోవాలి.
  2. ఇపుడు కడాయిలో నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. కాస్త వేడికాగానే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా రంగు మారేదాకా వేయించుకోవాలి.
  3. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు పుట్టగొడుగు ముక్కలు, బేబీ కార్న్, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకుని మగ్గనివ్వాలి.
  4. పుదీనా ఆకులు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి.
  5. ఇప్పుడు పసుపు, మిరియాల పొడి, కారం, గరం మసాలా వేసుకుని కూరగాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు బియ్యం కూడా వేసుకుని, ఒకసారి కలియబెట్టి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి.
  7. పావుగంటలో బియ్యం బాగా ఉడికిపోతుంది. రుచికరమైన బేబీకార్న్ పులావ్ రెడీ అవుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం