Alarm tips: అలారం పెట్టుకొని ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా? ప్రశాంతత కోసం ఈ టిప్స్ పాటించండి
02 November 2024, 16:30 IST
- Alarm tips: త్వరగా నిద్రలేచేందుకు చాలా మంది అలారం సెట్ చేసుకుంటారు. అయితే, అలారం వినిపించగానే హఠాత్తుగా నిద్రలో నుంచి ఉలికిపడి లేస్తారు. దీంతో మూడ్ చెడిపోతుంది. అయితే, అలారంతో ప్రశాంతంగా, పాజిటివిటీతో నిద్ర లేచేందుకు టిప్స్ ఇక్కడ చూడండి.
Alarm tips: అలారం పెట్టుకొని హఠాత్తుగా నిద్ర లేస్తున్నారా? ప్రశాంతత కోసం ఈ టిప్స్ పాటించండి
ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేవాలని చాలా మందికి ఉంటుంది. అయితే, ఉద్యోగాలు, చదువులు ఇలా రకరకాల కారణాలతో త్వరగానే మేల్కోవాల్సి ఉంటుంది. అందుకే అలారం పెట్టుకొని మరీ ఉదయాన్ని నిద్ర లేస్తుంటారు. అయితే, కొందరు అలారం వినగానే ఉలిక్కి పడి హఠాత్తుగా నిద్రలో నుంచి బయటికి వస్తారు. ఇలా జరగడం వల్ల ఉదయాన్నే మూడ్ చెడిపోయి కంగారుగా ఉంటుంది. అయితే, అలారం పెట్టుకున్న కొన్ని టిప్స్ పాటించడం వల్ల ప్రశాంతంగా నిద్ర లేవొచ్చు. దీనిల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాంటి అలారం టిప్స్ ఇక్కడ తెలుసుకోండి.
గట్టి శబ్దాలతో ఉండేవి వద్దు
గట్టి శబ్దాలతో ఉండే అలారం మ్యూజిక్‍లను మొబైళ్లలో, వాచ్‍లో సెట్ చేసుకోవద్దు. లౌడ్ మ్యూజిక్ వల్ల నిద్రలో నుంచి ఉలిక్కి పడి హఠాత్తుగా లేచే అవకాశాలు ఉంటాయి. గట్టిగా శబ్దం వస్తే స్నూజ్ చేసి మళ్లీ పడుకునే ఛాన్సులు ఎక్కువ. గట్టి శబ్దాలు నెగెటివ్ వైబ్స్ తీసుకొస్తాయి. ఉదయాన్నే చిరాకు కలిగిస్తాయి.
ప్రశాంతంగా ఉండే అలారం
చాలా మంది రాత్రి అలారం సెట్ చేసుకుంటారు. అనుకున్న సమయానికి నిద్ర లేచేందుకు పూర్తిగా దానిపై ఆధారపడతారు. అలాంటప్పుడు సాప్ట్‌గా, ప్రశాంతమైన శబ్దంతో ఉండే టోన్‍ను అలారంకు సెట్ చేసుకోవాలి. ప్రశాంతంగా ఉండే మ్యూజిక్‍ను అలారంగా సెట్ చేసుకుంటే మీ మూడ్ ఫ్రెష్‍గా ఉన్నట్టు అనిపిస్తోంది. శాంతంగా నిద్ర లేవొచ్చు. ఫీల్ గుడ్‍గా అనిపిస్తుంది. ఉదయాన్ని పాజిటివిటీ పెరుగుతుంది.
ఆధ్యాత్మికంగా..
పాజిటివ్ ఎనర్జీ కోసం చాలా మంది ఆధ్యాత్మిక విషయాలను పాటిస్తారు. అందుకే అలారం టోన్‍గా మీరు పాటించే మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక మ్యూజిక్‍నో, పాటనో అలారంగా సెట్ చేసుకోండి. ఇది పాజిటివ్, ఎనర్జిటిక్ ఫీలింగ్ ఇస్తుంది. ఆ సౌండ్ మీ చెవులకు చేరినప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది, సంతోషంగా అనిపిస్తుంది. దీనివల్ల రోజంతా మైండ్ ఫ్రెష్‍గా ఉండే అవకాశం ఉంది.
స్నూజ్ చేయకుండా..
కొందరు అలారం సెట్ చేసుకున్నా.. దాన్ని స్నూజ్ చేస్తూ నిద్రపోతూనే ఉంటారు. లేవాలని అనుకుంటున్నా.. ఆటోమేటిక్‍గా ఇలా చేస్తుంటారు. ఇలా చేసే వారు.. ప్రతీ రోజు అలారం సెట్ చేసే మొబైల్ లేకపోతే వాచ్‍ను ఒకే చోట కాకుండా కాస్త దూరంగా ఉంచుకోండి. ప్లేస్‍లు మారుస్తూ ఉంచండి. దీనివల్ల అలారం ఆఫ్ చేసేందుకు కాస్త దూరం వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రలో నుంచి మొలకువ వచ్చి.. ఎందుకు లేవాలనుకున్నది గుర్తొస్తుంది.
టాపిక్