Apple MacBook Air 2022 : యాపిల్ మాక్ బుక్ 2022 విడుదల
07 June 2022, 11:19 IST
- యాపిల్ గాడ్జెట్ ప్రియులు ఎదురుచూస్తోన్న మాక్ బుక్ 2022 ఎడిషన్ విడుదలైంది. వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లతో కూడిన మాక్‌బుక్ కొత్త వర్షన్‌ను విడుదల చేశారు. ఎం2 చిప్‌తో తయారైన ఈ మోడల్ మంగళవారం విడుదలైంది.
ఎం2 ప్రొసెసర్‌తో తయారైన మాక్‌బుక్‌ను ప్రదర్శిస్తోన్న యాపిల్ సీఈఓ టిమ్‌కుక్
మాక్‌బుక్ కొత్త వర్షన్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం వర్షన్ 9తో మంగళవారం విడుదలైంది. 8కోర్ సిపియు, 10కోర్ వరకు జిపియు సామర్ధ్యమున్న ఈ మోడల్ 8జిబి ర్యామ్ 512 జిబి ఎస్‌ఎస్‌డి హార్డ్ డ్రైవ్‌తో లభిస్తుంది. 2022 ఎడిషన్ మాక్‌బుక్‌లో 13.6 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంటుంది. సిల్వర్, స్టార్ లైట్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లూ, స్పేస్ గ్రే రంగుల్లో ఈ మోడల్‌ను విడుదల చేశారు.
కొత్త మోడల్ మాక్‌బుక్‌లో 1080 పిక్సెల్ ఫేస్‌టైం హై డెఫినిషన్ కెమెరా, ఇమేజ్ సెన్సార్, డాల్బీ అట్మాస్ ఫోర్ స్పీకర్ సౌండ్ సిస్టం లభిస్తాయి. ప్రొఫెషనల్ రిజల్యుషన్ హార్డ్‌వేర్ ఇంజిన్ వల్ల వీడియో ఎన్‌కోడింగ్, డికోడింగ్‌లలో నాణ్యత బాగుంటుంది. 4కె, 8కె వీడియోలను మునపటి కంటే మెరుగ్గా వీక్షించేలా కొత్త మొడల్‌ను తీర్చిదిద్దినట్లు టెక్‌బ్రష్ రివ్యూ పేర్కొంది. మాక్‌బుక్ ఎయిర్ ఎం2 సిరీస్ ధర భారత్‌లో రూ.1.19లక్షల నుంచి మొదలవుతుంది.
టాపిక్