తెలుగు న్యూస్  /  ఫోటో  /  Amla In Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో ఉసిరి తింటే కలిగే లాభాలు అన్ని ఇన్ని కాదు

Amla in Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో ఉసిరి తింటే కలిగే లాభాలు అన్ని ఇన్ని కాదు

19 January 2023, 13:03 IST

Amla in Pregnancy for Health Benefits: గర్భధారణ సమయంలో కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమంటారు. అలాగే కొన్ని ఫుడ్స్ తీసుకోమంటారు. దానిలో ఉసిరి ఒకటి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు రావు అంటారు. మరి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Amla in Pregnancy for Health Benefits: గర్భధారణ సమయంలో కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమంటారు. అలాగే కొన్ని ఫుడ్స్ తీసుకోమంటారు. దానిలో ఉసిరి ఒకటి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు రావు అంటారు. మరి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో తినడం, తాగడంలో చాలా పరిమితులు ఉన్నాయి. అందుకే వైద్యులు తల్లి తీసుకునే ఆహారం నుంచి అనేక ఆహారాలను మినహాయించారు. అయితే కొన్ని ఆహారాలను తినమని కూడా సలహా ఇస్తారు. వాటిలో ఉసిరి కాయ ఒకటి. దీనిలో ఉండే బహుళ పోషక గుణాలు గర్భధారణ సమయంలో తల్లికి చాలా మేలు చేస్తాయి.
(1 / 6)
గర్భధారణ సమయంలో తినడం, తాగడంలో చాలా పరిమితులు ఉన్నాయి. అందుకే వైద్యులు తల్లి తీసుకునే ఆహారం నుంచి అనేక ఆహారాలను మినహాయించారు. అయితే కొన్ని ఆహారాలను తినమని కూడా సలహా ఇస్తారు. వాటిలో ఉసిరి కాయ ఒకటి. దీనిలో ఉండే బహుళ పోషక గుణాలు గర్భధారణ సమయంలో తల్లికి చాలా మేలు చేస్తాయి.(Freepik)
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గర్భధారణ సమయంలో ఉసిరి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక కణాలను బలపరుస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
(2 / 6)
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గర్భధారణ సమయంలో ఉసిరి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక కణాలను బలపరుస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.(Freepik)
మార్నింగ్ సిక్‌నెస్‌ని తొలగిస్తుంది. కాబోయే తల్లులకు ఉదయం చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే వికారం, నీరసం ఉన్నవారు ఉసిరికాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది.
(3 / 6)
మార్నింగ్ సిక్‌నెస్‌ని తొలగిస్తుంది. కాబోయే తల్లులకు ఉదయం చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే వికారం, నీరసం ఉన్నవారు ఉసిరికాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది.(Freepik)
గర్భధారణ సమయంలో మలబద్ధకం చాలా సాధారణ సమస్య. అలాగే ఈ సమయంలో హెమోరాయిడ్స్ కూడా ఉంటాయి. అయితే ఉసిరిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.
(4 / 6)
గర్భధారణ సమయంలో మలబద్ధకం చాలా సాధారణ సమస్య. అలాగే ఈ సమయంలో హెమోరాయిడ్స్ కూడా ఉంటాయి. అయితే ఉసిరిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.(Freepik)
చేతులు, కాళ్ల వాపును నివారిస్తుంది. గర్భధారణ సమయంలో సంభవించే సమస్యలలో చేతులు, కాళ్లు వాపు ఒకటి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. తద్వార ఇది చేతులు, కాళ్ల వాపును నివారిస్తుంది.
(5 / 6)
చేతులు, కాళ్ల వాపును నివారిస్తుంది. గర్భధారణ సమయంలో సంభవించే సమస్యలలో చేతులు, కాళ్లు వాపు ఒకటి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. తద్వార ఇది చేతులు, కాళ్ల వాపును నివారిస్తుంది.(Freepik)
గర్భధారణ సమయంలో రక్తపోటు హెచ్చుతగ్గులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఉసిరిలోని విటమిన్ సి రక్తనాళాలను విస్తరిస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది.
(6 / 6)
గర్భధారణ సమయంలో రక్తపోటు హెచ్చుతగ్గులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఉసిరిలోని విటమిన్ సి రక్తనాళాలను విస్తరిస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి