తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ambrane Stylo Max । ఇదిగో 50,000 Mah భారీ బ్యాటరీతో హెవీ డ్యూటీ పవర్ బ్యాంక్!

Ambrane Stylo Max । ఇదిగో 50,000 mAh భారీ బ్యాటరీతో హెవీ డ్యూటీ పవర్ బ్యాంక్!

HT Telugu Desk HT Telugu

29 June 2022, 22:26 IST

    • ఆంబ్రేన్ కంపెనీ స్టైలో మాక్స్ పేరుతో 50,000mAh సామర్థ్యం కలిగిన హెవీ-డ్యూటీ బ్యాంక్‌ను ఆవిష్కరించింది. దీనితో పెద్దసైజ్ పరికరాలను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ధర కూడా తక్కువే ఉంది. పూర్తి వివరాలు చూడండి.
Ambrane Stylo Max
Ambrane Stylo Max (Ambrane India)

Ambrane Stylo Max

మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల పవర్ బ్యాంక్‌లను చూసుంటారు. వాటన్నింటి గరిష్ట సామర్థ్యం 20000mAh వరకు ఉండవచ్చు. అయితే ఇప్పుడు అంతకుమించిన శక్తితో బాహుబలి పవర్ బ్యాంక్ ఒకటి మార్కెట్లోకి వచ్చేసింది. దీనిని తయారుచేసింది కూడా ఇండియన్ కంపెనీ కావడం మరొక విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

River Rafting: మీకు రివర్ రాఫ్టింగ్ చేయడం ఇష్టమా? అయితే మన దేశంలో ఈ నదీ ప్రాంతాలకు వెళ్ళండి

New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

మొబైల్ యాక్సెసరీస్ బ్రాండ్ ఆంబ్రేన్.. Stylo Max పేరుతో మొట్టమొదటి హెవీ-డ్యూటీ, పవర్-ప్యాక్డ్ పవర్ బ్యాంక్‌ను ఆవిష్కరించింది. ఏకంగా 50,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో స్టైలో మ్యాక్స్ పవర్ బ్యాంక్‌ను విడుదల చేసింది. దీనిని ప్రత్యేకంగా హైకర్‌లు, క్యాంపర్‌ల కోసం ఆంబ్రేన్ రూపొందించింది. ఇది డిజిటల్ కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల వంటి పెద్దసైజ్ పరికరాలకు కూడా బ్యాటరీ బ్యాకప్ అందించగలదు. సుదూర ప్రయాణాలు చేసేటపుడు ఈ పవర్ బ్యాంక్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌కు అనేకసార్లు పూర్తి ఛార్జింగ్‌ను అందివ్వగలదు.

Ambrane Stylo Max పవర్ బ్యాంక్ ఫీచర్లు

ఈ పవర్ బ్యాంక్ 50000 mAh Li-Polymer బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జ్ 3.0 కోసం ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే హై-స్పీడ్ టూ-వే ఛార్జింగ్‌కు ఈ పవర్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. దీనికి కనెక్ట్ చేసిన ప్రతి పరికరాన్ని సురక్షితంగా ఛార్జ్ చేయడానికి పవర్ అవుట్‌పుట్‌ని స్వయంచాలకంగా నియంత్రిస్తుంది.

ఈ Stylo Max పవర్‌ బ్యాంక్ ఒకే సమయంలో ఎక్కువ పరికరాలను ఛార్జ్ చేయగలదు. దీనికి రెండు USB పోర్టులు, అలాగే ఒక టైప్-C కనెక్షన్‌తో ఇచ్చారు. ఇది భద్రతపరంగానూ నాణ్యమైనదిగా ఉంది. హీటింగ్ సమస్య, షార్ట్ సర్క్యూట్లను నిరోధించడం కోసం ఈ పవర్ బ్యాంక్‌ను 9 లేయర్లతో తయారుచేశారు. అంతేకాకుండా దీనిని హై-గ్రేడియంట్ మాట్ మెటాలిక్ కేసింగ్‌లో పొందుపరిచారు. దీంతో ఇది ఎంతో దృఢంగా ఉంటుంది.

ధర ఎంతంటే..

అల్ట్రా-హై కెపాసిటీ 50000mAh కలిగిన ఆంబ్రేన్ స్టైలో మ్యాక్స్ పవర్ బ్యాంక్ ధర రూ. 3999/- మాత్రమే. ఇది నీలం, నలుపు రంగులలో లభ్యం అవుతోంది. కంపెనీ దీనికి 180 రోజుల వారంటీని కూడా ఇస్తోంది. ఈ పవర్ బ్యాంకును వినియోగదారులు Amazon, Flipkartతో పాటు Embraine వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

టాపిక్