Fennel Milk Benefits : గుండె ఆరోగ్యం నుంచి రక్తహీనతను నివారించే వరకు.. సోంపు పాలతో ప్రయోజనాలు
05 November 2023, 16:30 IST
- Fennel Milk Benefits In Telugu : పాలు, సోంపు మన మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. అవి శరీరానికి మేజిక్ లాగా ఎప్పుడు పనిచేస్తాయో తెలుసా? సోంపు పాలను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటాయి.
పాలు
సోంపు పాలు(Fennel Milk) ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక గ్లాసు పాలలో 1/2 టీస్పూన్ సోంపు గింజలు వేసి తయారు చేయాలి. పాలు, అర టీస్పూన్ సోంపు వేసి బాగా మరిగించి, వడకట్టండి. మీకు తగ్గట్టుగా పంచదార లేదా బెల్లం వేసుకోవచ్చు. సోంపు పాలు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం
సోంపు పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సోంపులోని ముఖ్యమైన నూనె గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచడం ద్వారా జీర్ణక్రియ ప్రక్రియను పెంచుతుంది. ఈ పాలు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాలలో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
రక్తహీనతకు ఒక సాధారణ కారణం ఇనుము లోపం. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ సోంపులో ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇది శరీరానికి ఐరన్ అవసరాన్ని తీరుస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ను సమతుల్యం చేస్తుంది. ఇది రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
దృష్టి లోపం లేదా కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు రోజూ ఒక గ్లాసు సోంపు పాలు తాగాలి. కంటిశుక్లం వంటి కంటి సమస్యలను నివారించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతారు.
సోంపులో మన గుండె ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉన్నాయి. అలాగే మన గుండెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. సోంపు గింజల పాలు తాగడం వల్ల మన గుండె ఆరోగ్యానికి మేలు చేసే కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తుంది.
సోంపులో ఉన్న పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మన మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్, ఊబకాయం, గుండె సమస్యలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలకు, సోంపు గింజల పాలు మీకు ఉత్తమం. శ్వాసకోశ వ్యాధులతో పోరాడే ఫైటోన్యూట్రియెంట్స్ ఇందులో ఉన్నాయి.
సోంపు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంది. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో, మొటిమలను నివారించడంలో సహాయపడతాయి. సోంపు పాలు తాగడం వల్ల మీ చర్మానికి గ్రేట్ గా సహాయపడుతుంది. సోంపు పాలు మన మొత్తం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఇది పెద్ద పరిమాణంలో తీసుకోవద్దు. మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.