తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saffron Water Benefits : చిటికెడు కుంకుమపువ్వుతో అనేక ప్రయోజనాలు.. కానీ ఇలా తీసుకోవాలి

Saffron Water Benefits : చిటికెడు కుంకుమపువ్వుతో అనేక ప్రయోజనాలు.. కానీ ఇలా తీసుకోవాలి

Anand Sai HT Telugu

10 October 2023, 9:58 IST

google News
    • Saffron Water Benefits : కుంకుమపువ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నేరుగా తినకుండా నీటిలో నానబెట్టి.. కుంకుమపువ్వును తీసుకుంటే చాలా మంచిది.
కుంకుమపువ్వు
కుంకుమపువ్వు (unsplash)

కుంకుమపువ్వు

వంటలో రుచి, వాసన పెంచడానికి కుంకుమపువ్వు చాలా ఉపయోగపడుతుంది. చిటికెడు కుంకుమపువ్వు.. వంటకానికి మంచి ఫ్లేవర్‌ని తీసుకువస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసుగా కుంకుమపువ్వు ప్రసిద్ధి చెందింది. ధర చాలా ఎక్కువ అయినా.. డిమాండ్ కూడా ఎక్కువే ఉంది.

కుంకుమపువ్వు అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుంకుమపువ్వు నానబెట్టిన నీటిని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నీరు తాగడం వల్ల శరీరంలో ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం.

మెదడు అభివృద్ధికి కుంకుమపువ్వు సహాయపడుతుంది. మెదడు కణాలను చురుకుగా, రక్షించడంలో సహాయపడుతుంది. మంచి జ్ఞాపకశక్తిని కాపాడుకోవడానికి కుంకుమపువ్వు కలిపిన నీటిని క్రమం తప్పకుండా తాగొచ్చు. ఇది కాకుండా ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటిడిప్రెసెంట్ గుణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చూపించాయి. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. డిప్రెషన్‌తో బాధపడే వారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

కుంకుమపువ్వు నానబెట్టిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి వివిధ సమస్యల నుండి బయటపడొచ్చు. ఇది ఆకలి బాధలను తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది తీసుకుంటే ఆకలి తరచుగా ఉండదు. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. కుంకుమపువ్వులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ నీరు తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది.

కంటి చూపును పెంచేందుకు కుంకుమపువ్వు చాలా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వివిధ కంటి సమస్యలను నయం చేస్తాయి. వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత, కంటిశుక్లాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చాలా మంది బహిష్టు సమయంలో భరించలేని కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ఈ సందర్భంలో కుంకుమపువ్వు నీరు గొప్ప ఉపశమనం ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ (PMS) లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా ఈ పానీయం చాలా మేలు చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కుంకుమపువ్వు సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కుంకుమపువ్వు నీరు ఉపయోగకరంగా ఉంటుంది. కుంకుమపువ్వు క్యాన్సర్ కారక కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను ఎంపిక చేసి నాశనం చేస్తుంది.

తదుపరి వ్యాసం