First Night Tips : ఫస్ట్ నైట్ అంటే భయమేస్తుందా? ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి
09 December 2023, 20:00 IST
- First Night Tips Telugu : మీ వయస్సు, అనుభవంతో సంబంధం లేకుండా కొన్నిసార్లు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు రావొచ్చు. మెుదటి రాత్రి మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తుంది. మీరు కొత్తగా పెళ్లయిన వారైతే మొదటిరాత్రిలోనే లైంగిక సమస్యను ఎదుర్కొంటారు. దీన్ని ఎలా తగ్గించాలి?
ప్రతీకాత్మక చిత్రం
మెుదటి రాత్రి ఆందోళన అనేది నవ వధూవరులు ఎదుర్కొనే సాధారణ సమస్య. చాలా మంది జంటలు తమ ఫస్ట్ నైట్ గురించి భయపడతారు. లోపలికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందోననే భయం ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఇది సంబంధంలో ఒత్తిడిని కలిగిస్తుంది. కొత్త జంటలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య లైంగిక పనితీరు ఎలా ఉంటుందో అనే భయం. దీంతో ఫస్ట్ నైట్ దారుణంగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
లైంగిక పనితీరు ఆందోళన లక్షణాలు పురుషులలో అనేక విధాలుగా వ్యక్తమవుతాయి. అంటే చెమట పట్టిన అరచేతులు, ఏదో తెలియని ఆందోళన అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ లక్షణాలు మరింత తీవ్రమైన పానిక్ అటాక్ రూపంలో కనిపిస్తాయి, ఇది అసంతృప్తి, నిరాశకు దారితీస్తుంది. దీన్ని అధిగమించాలి.
ఏదైనా సంబంధంలో ఒకరితో ఒకరు అవగాహనతో మాట్లాడుకోవడం చాలా సమస్యలను దూరం చేస్తుంది. కానీ చాలా మంది లైంగిక సంబంధంలో తమ భావాలు, చింతల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ అన్ని విషయాలు పంచుకోవడం, ఒకరినొకరు ఓదార్చుకోవడం ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సహాయం చేసుకోవడం ఈ సమస్యను అధిగమించడంలో సహాయపడుతుంది. మీ భయాల గురించి బహిరంగంగా మాట్లాడండి. ఇది మీ ఇద్దరికీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేస్తారు.
లైంగిక పనితీరు ఆలోచనను ఒక్క క్షణం మరచిపోండి. భౌతిక అంశాల కంటే భావోద్వేగ సాన్నిహిత్యం, కనెక్షన్, ఆనందంపై దృష్టి పెట్టండి. సాన్నిహిత్యం మీ లైంగిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆందోళనను తగ్గిస్తుంది.
ప్రతి రిలేషన్ షిప్ లో థ్రిల్ గా ఉండాలంటే కొత్తగా చేయడం చాలా అవసరమని నిపుణులు అంటున్నారు. చేసిన పనిని మళ్లీ మళ్లీ చేస్తే కొంతకాలానికి బోర్ కొడుతుంది. కొత్త విషయం వల్ల మీరు లైంగికంగా ఆందోళన చెందలేరు. బాగా మాట్లాడండి. మీకు జీవితంలో ఏం కావాలో కూడా చర్చించండి. మెుదటి రాత్రి సరిగా జరగలేదని.. ఇక ప్రతీ రాత్రి అలాగే ఉంటుందని అపొహలో మాత్రం ఉండకండి.
పెళ్లికి ముందు నుంచే కొన్ని అలవాట్లను మీరు చేసుకోవాలి. మీ దినచర్యలో శ్వాస వ్యాయామాలు చేర్చండి. లోతైన శ్వాస, ధ్యానం లైంగిక చర్యలో పాల్గొనే ముందు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోవడం వల్ల మీరు లైంగికంగా అనుభవించే ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.