Bathukamma Song Lyrics : ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో.. మీకోసం పూర్తి పాట లిరిక్స్
21 October 2023, 13:30 IST
- Bathukamma Songs With Lyrics : కొన్ని బతుకమ్మ పాటలకు మెుదటి లిరిక్స్ తెలిసి ఉంటాయి. మెుత్తం లిరిక్స్ మాత్రం దొరకవు. అలాంటి వాటిలో ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో పాట ఒకటి. ఈ పాట పూర్తి లిరిక్స్ మీకోసం..
బతుకమ్మ పాటలు
ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో పాట వినేందుకు బాగుంటుంది. చాలా ఏళ్ల నుంచి ఈ పాట వినిపిస్తూ ఉంది. అయితే కొందరు సగం పాట మాత్రమే పాడుతుంటారు. మిగిలిన లిరిక్స్ తెలియక మధ్యలోనే పాట ఆపేసి మరో పాటను అందుకుంటారు. ఈ పాట పూర్తి లిరిక్స్ మీకోసం..
ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో పాట
ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో
ఒకదారి నడువంగ ఉయ్యాలో
అక్కకు దొరికింది ఉయ్యాలో
కుచ్చుల దండ ఉయ్యాలో
అక్క నీకెక్కడిదె ఉయ్యాలో
ఈ కుచ్చులదండ ఉయ్యాలో
కూడెల్లి మల్లన్న ఉయ్యాలో
పంపిన దండ ఉయ్యాలో
పర్వతాల మల్లన్న ఉయ్యాలో
పంపిన దండ ఉయ్యాలో
వేములవాడ రాజన్న ఉయ్యాలో
చేసిన దండ ఉయ్యాలో
వేములవాడ రాజన్న ఉయ్యాలో
ఎక్కడుంటాడో ఉయ్యాలో
గుండంలో స్నానమాడి ఉయ్యాలో
గుళ్లె ఉంటాడు ఉయ్యాలో
పేదరాసి పెద్దమ్మ ఉయ్యాలో
చిన్న కోడలిని ఉయ్యాలో
చిన్న కోడలు వయితే ఉయ్యాలో
ఎందుకొచ్చినావు ఉయ్యాలో
సంతానము లేక ఉయ్యాలో
వచ్చినాను స్వామి ఉయ్యాలో
ఇచ్చెటోడు ఈశ్వరుడు ఉయ్యాలో
రాసేది బ్రహ్మ ఉయ్యాలో
శివుడి దగ్గరకు పోయి ఉయ్యాలో
చిట్టి రాయించి ఉయ్యాలో
చిట్టిల ఉన్నడే ఉయ్యాలో
నా చిన్ని బాలుడు ఉయ్యాలో
నా చిన్ని బాలునికి ఉయ్యాలో
పాలే లేవాయే ఉయ్యాలో
వసుదేవుడిచ్చిండు ఉయ్యాలో
ఈ వరద కాలువు ఉయ్యాలో
పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో
పాడి ఆవుల మంద ఉయ్యాలో
తొమ్మిది రోజులు ఉయ్యాలో పాట
తొమ్మిది రోజులు ఉయ్యాలో
నమ్మిక తోడుతో ఉయ్యాలో
అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో
అరుగుల వేయించి ఉయ్యాలో
గోరింట పూలతో ఉయ్యాలో
గోడలు పెట్టించి ఉయ్యాలో
తామర పూలతో ఉయ్యాలో
ద్వారాలు పెట్టించి ఉయ్యాలో
మెుగిలి పూలతోనూ ఉయ్యాలో
మెుగురాలు ఎక్కించి ఉయ్యాలో
వాయిలి పూలతో ఉయ్యాలో
వాసాలు చేయించి ఉయ్యాలో
పొన్న పూలతోను ఉయ్యాలో
యిల్లును కప్పించి ఉయ్యాలో
పసుపు ముద్దను చేసి ఉయ్యాలో
తోరణాలు కట్టించి ఉయ్యాలో
దోసపూలతోనూ ఉయ్యాలో
గౌరమ్మను నిలిపిరి ఉయ్యాలో
చేమంతి పూలతోనూ ఉయ్యాలో
చెలియను పూజింతురు ఉయ్యాలో
సుందరాంగులెల్ల ఉయ్యాలో
చుట్టూతా తిరిగిరి ఉయ్యాలో
ఆటలు ఆడిరి ఉయ్యాలో
పాటలు పాడిరి ఉయ్యాలో
ఆటపాటలు చూసి ఉయ్యాలో
ఆనందమెుందిరి ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చే ఉయ్యాలో
కాంతలందరికి ఉయ్యాలో
ఆడిన వారికి ఉయ్యాలో
ఆరోగ్యము కల్గు ఉయ్యాలో
పాడిన వారికి ఉయ్యాలో
పాడిపంటలు కల్గు ఉయ్యాలో
విన్నట్టి వారికి ఉయ్యాలో
విష్ణుపథము కల్గు ఉయ్యాలో