తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Alien Hunt | గ్రహాంతర వాసులు ఉన్నారా? వేట మొదలుపెట్టిన నాసా!

Alien Hunt | గ్రహాంతర వాసులు ఉన్నారా? వేట మొదలుపెట్టిన నాసా!

13 June 2022, 14:21 IST

భూమి కాకుండా భూమిని పోలిన గ్రహాలు, సౌర కుటుంబాలు ఉన్నాయని మనం విన్నాం. వీటిని మనం విశ్వసించవచ్చు కూడా. మరి గ్రహాంతర వాసులు ఉన్నారా? అంటే ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. నాసా లాంటి అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఈ విషయాన్ని చాలా కాలంగా విస్మరించింది. అలాంటివేమి ఉండవని ఖగోళ శాస్త్రజ్ఞులు కొట్టిపారేశారు. కానీ అప్పుడప్పుడు ఆకాశంలో ఎగిరే వస్తువులు కనిపించాయని వార్తలు రావడం వెనక మర్మం ఏమిటి? అయితే ఇప్పుడు నాసా దీనిపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆకాశంలో ఎగిరే సాసర్ల మర్మం ఏంటో తెలుసుకోవడానికి ఒక మెయిన్ స్ట్రీమ్ ఆపరేషన్‌ను లాంచ్ చేసింది. UFO (Unidentified Flying Object)ల అధ్యయనాన్ని NASA ప్రారంభించింది. ఇప్పటివరకు గుర్తించలేని వైమానిక దృగ్విషయాలపై (UAPs) లోతైన సమాచారాన్ని సేకరించనుంది. అంటే ఏలియన్స్ కోసం నాసా వేట మొదలుపెట్టినట్లే అని నివేదికలు ధృవీకరిస్తున్నాయి.