తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Donation: రక్తదానం చేశాక ఇచ్చిన రక్తం తిరిగి శరీరంలో చేరడానికి ఎన్ని రోజులు పడుతుంది?

Blood Donation: రక్తదానం చేశాక ఇచ్చిన రక్తం తిరిగి శరీరంలో చేరడానికి ఎన్ని రోజులు పడుతుంది?

Haritha Chappa HT Telugu

03 October 2024, 9:30 IST

google News
    • Blood Donation: రక్తదానం ప్రాణదానంతో సమానం. రక్తాన్ని కృత్రిమంగా చేయలేము, కాబట్టి ఎవరో ఒకరు దానం చేసి ఎదుటివారి ప్రాణాన్ని కాపాడాలి. రక్తదానం చేశాక శరీరంలో జరిగే మార్పులు గురించి తెలుసుకోండి.
రక్తదానం వల్ల ఉపయోగాలు
రక్తదానం వల్ల ఉపయోగాలు

రక్తదానం వల్ల ఉపయోగాలు

Blood Donation: మనిషి శరీరంలో రక్తం ఎంతో ప్రధానమైనది. శరీరంలో సరిపడినంత రక్తం ఉంటేనే మనిషి ఆరోగ్యంగా జీవించగలడు. యాక్సిడెంట్లు జరిగిన సమయంలో లేదా కొన్ని శస్త్ర చికిత్సల సమయంలో ఇతరులకు రక్తదానం చేయాల్సిన అవసరం వస్తుంది. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేరు, కాబట్టి ఒక మనిషి నుంచి సేకరించాల్సిందే. అందుకే రక్తదానాన్ని ప్రాణదానంతో సమానంగా పోలుస్తారు. మీరు ఇచ్చే రక్తం మరొకరికి ఆయుష్షును పెంచుతుంది.

ఎన్నిసార్లు రక్తదానం?

సంవత్సరానికి రెండు సార్లు రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్య రాదు. ఇది మరొకరి కుటుంబంలో వెలుగులు నింపుతుంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి రక్తదానం చేయమని చైతన్యవంతులను చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది ఇప్పటికే రక్త దానం చేసి ఎదుటివారి ప్రాణాలను కాపాడుతున్నారు.

రక్తదానం హానికరం కాదు. చాలామంది రక్తదానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భావిస్తూ ఉంటారు. రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు రావు. మీ నుంచి రక్తం తీసుకునే ముందు వైద్యులు మీకు అన్ని పరీక్షలు చేశాక ఆరోగ్యవంతులని తేల్చాకే మీ రక్తాన్ని సేకరిస్తారు. రక్తదానం చేయడం వల్ల మీకు కూడా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి వీలైనప్పుడు రక్త దానం చేయడానికి ప్రయత్నించండి. అలా అని మీకు సరిపడా రక్తం లేకుండా దానం చేయొద్దు. మిమ్మల్ని ప్రాణాపాయ స్థితిలోకి అది నెట్టి వేస్తుంది.

రక్తదానం చేశాక ఏం తినాలి?

రక్తదానం చేశాక మీకు కాస్త బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మంచి ఆహారం తీసుకుంటే మీ శరీరం త్వరగా కోలుకుంటుంది. రక్తదానం చేశాక పాలకూర, పచ్చి బఠానీలు, కాయధాన్యాలు, బీన్స్, టోఫు, ఆకుపచ్చని కూరలతో వండిన ఆహారాలను అధికంగా తినండి. అలాగే ఎండు ద్రాక్షలను తింటూ ఉండండి. ఇది రక్తాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. రక్తదానం చేశాక నీరసంగా అనిపిస్తే వెంటనే కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ద్రవాలు తాగండి. తగినంత నిద్ర చేయండి.

ఎంత రక్తం సేకరిస్తారు?

ఒక వ్యక్తి నుండి ఒకసారి ఒక యూనిట్ రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు. ఒక యూనిట్ అంటే 350 మిల్లీగ్రాములు. ఇది మీ శరీరంలో ఉన్న రక్తంలో 15వ వంతు. రక్తదానం చేసిన వెంటనే శరీరం దాని నుండి కోలుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. 24 గంటల్లో కొత్త రక్తం ఉత్పత్తి కావడం మొదలవుతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడమే. అలాగే పండ్లు, పాలు వంటివి ఆహారంలో ఉండేట్టు చూసుకోండి.

తదుపరి వ్యాసం