తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poor Gut Health : నుదిటి, బుగ్గలపై మొటిమలు.. పేగు ఆరోగ్యం గురించి చెబుతున్నాయా?

Poor Gut Health : నుదిటి, బుగ్గలపై మొటిమలు.. పేగు ఆరోగ్యం గురించి చెబుతున్నాయా?

HT Telugu Desk HT Telugu

13 February 2023, 10:06 IST

google News
    • Poor Gut Health : మనం ఏం తింటున్నామో అది మన ముఖంలో కనిపిస్తుంది. చర్మ సమస్యలు, పేగు ఆరోగ్యం మధ్య బలమైన లింక్ ఉందని వైద్యులు చెబుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొటిమలు యుక్తవయస్సులో రావడం సహజమే. అయితే ఇది పేగు ఆరోగ్యానికి సంకేతంగా చూడొచ్చు. మీరు మీ గట్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చూపించడానికి మీ చర్మం చెబుతూనే ఉంటుందట. చర్మ సమస్యలు, పేగు ఆరోగ్యం మధ్య సంబంధాన్ని ముంబైలోని అపోలో స్పెక్ట్రాలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ హర్షద్ జోషి చెప్పుకొచ్చారు.

మనం తీనేవాటితోనే చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మన పేగులు ఒకరకమైన ఫుడ్ కు అలవాటు పడి.. సెటప్ అయి ఉంటాయి. వాటికి చికాకు కలిగించే ఏదైనా.., అది మంటను కలిగిస్తుంది. కాబట్టి, అలెర్జీ కారకాలు, ఆల్కహాల్, మందులు, ఆహార సంకలనాలు, కృత్రిమ రంగులు, ఫైబర్ తక్కువగా మరియు చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు గట్ లైనింగ్‌ను చికాకుపెడతాయి. అలా జరిగినప్పుడు శరీరం కూడా మంటగా ఉంటుంది. ఇది క్రమంగా, చర్మం వాపును తీవ్రతరం చేస్తుంది.

గట్‌లోని అసమతుల్య మైక్రోబయోమ్ అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. ఇది సున్నితమైన చర్మానికి దారితీస్తుంది. చివరికి తామర వంటి సమస్యలకు రావొచ్చు. ఇది మీ చర్మం పొడిగా, దురదగా మారడానికి కారణమవుతుంది. గట్‌లో ఏదైనా లోపం ఉన్నప్పుడు ఇది సాధారణంగా నుదిటిపై, బుగ్గలపై కనిపిస్తుంది. గట్ డైస్బియోసిస్, లీకీ గట్, కాండిడా పెరుగుదల, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి లేదా తక్కువ ఆమ్లం కూడా మొటిమలకు కారణం కావొచ్చు.

పేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఇది జరుగుతుందని డాక్టర్ జోషి చెప్పారు. ముఖం, పొడి చర్మంపై పెద్ద రంధ్రాలను కలిగి ఉంటారని తెలిపారు. ఇది పలు రకాల పేగు వ్యాధులకు సంకేతమని వెల్లడించారు.

పేగు ఆరోగ్యం సరిగా లేకుంటే.. గ్యాస్, అతిసారం, వికారం, కడుపు నొప్పి, ఆమ్లత్వం, మలబద్ధకం, బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వంటి సమస్యలను కలిగిస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గట్ వాపును తగ్గించే ప్రోబయోటిక్స్, పులియబెట్టిన ఆహారాలను ఎంచుకోవడానికి ప్రయత్నించండి. పేగు ఆరోగ్యం సరిగా అయ్యేందుకు తగినంత నీరు తాగటం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండండి. చక్కెర అధిక వినియోగం మానుకోండి.

ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, మొలకలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తినండి. ధూమపానం, ఆల్కహాల్, జంక్ ఫుడ్, జీర్ణాశయ సమతుల్యతను దెబ్బతీసే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించండి.

తదుపరి వ్యాసం