తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కొత్తిమీర ఐస్ క్రీమ్.. కొత్త ఫ్లేవర్ గురూ.. మీరు రుచి చూశారా?

కొత్తిమీర ఐస్ క్రీమ్.. కొత్త ఫ్లేవర్ గురూ.. మీరు రుచి చూశారా?

Manda Vikas HT Telugu

14 March 2022, 11:44 IST

    • మీరు 90's కు చెందిన వారైతే మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఆనాటి రోజుల్లో ఈ వేసవి కాలంలో 'ఆ ఐస్ కీ రే.. ఎర్రటి ఎర్రటి పచ్చటి పచ్చటి ఆఐస్ కీ రే' అంటూ ఇంటి ముందుకే ఐస్ క్రీమ్, ఐస్ పాప్స్, పెప్సీ అంటూ పిలిచే పాప్సికల్స్, ఐస్ క్యాండీస్ అమ్మేవారు.
Coriander Ice Cream
Coriander Ice Cream (twitter)

Coriander Ice Cream

వేసవి వచ్చేసింది, బయట ఎండలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఉక్కబోత రోజుల్లో శీతల పదార్థాలకు మంచి డిమాండ్ ఉంటుంది.

మీరు 90's కు చెందిన వారైతే మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఆనాటి రోజుల్లో ఈ వేసవి కాలంలో 'ఆ ఐస్ కీ రే.. ఎర్రటి ఎర్రటి పచ్చటి పచ్చటి ఆఐస్ కీ రే' అంటూ ఇంటి ముందుకే ఐస్ క్రీమ్, ఐస్ పాప్స్, పెప్సీ అంటూ పిలిచే పాప్సికల్స్, ఐస్ క్యాండీస్ అమ్మేవారు. అప్పట్లో ఒక్క రూపాయికే ఇలాంటివి రెండు ఐస్ క్రీమ్స్ వచ్చేవి.

ఇప్పుడు ఆ కాలం పోయింది, కాలం మారిపోయింది. ఇప్పుడంతా ఐస్ క్రీమ్ పార్లర్ కల్చర్. వెనీలా, చాకొలేట్, స్ట్రాబెరీ లాంటి రెగ్యులర్ ఫ్లేవర్ లతో పాటు టెండర్ కొకొనట్, ఎగ్ నాగ్ అంటూ కొత్తకొత్తగా డిఫెరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ ప్రియుల నోరూరిస్తున్నాయి.

ఎర్రటి ఎండలో చల్లటి హిమ క్రీమ్ నోటిని తాకి అలా సర్రున గొంతులోకి వెళ్తుంటే ఆ మజానే వేరు.

కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్తకొత్త ఐస్ క్రీమ్ ఫ్లేవర్లను కూడా పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తిమీర ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది. మనం సాధారంగా కొత్తిమీరను పప్పుల్లో, కూరల్లో గార్నిషింగ్ చేసుకొని తింటాం. అలాగే ఐస్ క్రీమ్ మీద కూడా కూసింత కొత్తిమీర చల్లుకొని తింటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి.

మరి ఈ కొత్త ఫ్లేవర్‌ను కనిపెట్టింది ఎవరో కాదు చైనీయులు. కరోనావైరస్ థర్డ్ వేవ్ పోయి ఫోర్త్ వేవ్ వచ్చే గ్యాప్‌లో ఇలాంటి కొత్త ఫ్లేవర్స్ కనిపెట్టి జనాలను ఇలా వెరైటీగా చంపండం వాళ్ల ట్రెండ్ కావొచ్చు. అంతకుముందు కొవిడ్ రెండో వేవ్ గ్యాప్‌లో నూడుల్స్ బిర్యానీ అని పరిచయం చేశారు.

ఇక చైనాలోని మెక్ డొనాల్డ్స్ వారు ఈ నూతనంగా ప్రవేశపెట్టిన కొరియాండర్ సండేయ్ (కొత్తిమీర ఫ్లేవర్ ఐస్ క్రీమ్)ను పరిచయం చేసింది. దానికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం