తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 975 నిండి ఉంది, మధ్యలో 973 ఇరుక్కుంది, అది ఎక్కడుందో ఐదు సెకన్లలో కనిపెట్టండి

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 975 నిండి ఉంది, మధ్యలో 973 ఇరుక్కుంది, అది ఎక్కడుందో ఐదు సెకన్లలో కనిపెట్టండి

Haritha Chappa HT Telugu

06 March 2024, 7:00 IST

google News
    • Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఆసక్తికరంగా ఉంటాయి. వీటిని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వారి కోసం ఇక్కడ ఒక ‘నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్’ ఇచ్చాము. దీన్ని అయిదు సెకన్లలో సాల్వ్ చేయండి.
ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: మీ ఐక్యూ అధికంగా ఉందో లేదో ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా చెక్ చేసుకోండి. ఐక్యూ లెవెల్స్ అధికంగా ఉంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను కేవలం 5 సెకన్లలో సాల్వ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో 975 అనే నెంబర్ ఉంది. ఎన్నో 975 నెంబర్ల మధ్య ఒక 973 నెంబర్ ఇరుక్కొని ఉంది. అది ఎక్కడ ఉందో ఐదు సెకండ్లలో కనుక్కుంటే మీరు చాలా తెలివైన వారని అర్థం. మీ మెదడు, కంటి సమన్వయం బాగుందని అర్థం చేసుకోవాలి.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబును 5 సెకన్లలోనే కనిపెట్టిన వారికి ఐక్యూ ఎక్కువ అని అర్థం. అలాగే వారి కన్ను, మెదడు మధ్య సమన్వయం కూడా చక్కగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక జవాబు విషయానికి వస్తే పదవ నిలువ వరసలో కింద నుంచి రెండో నెంబర్‌ని చూడండి. అదే 973.

శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్న ప్రకారం అధిక ఐక్యూ లెవెల్ ఉన్నవారు ఆప్టికల్ ఇల్యూషన్ లను త్వరగా సాల్వ్ చేస్తారని అర్థం. అలాగే వారికి సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఎక్కువని అర్థం చేసుకోవాలి. ఏ విషయాన్నైనా వారు త్వరగా అవగాహన చేసుకుంటారని తెలుసుకోవాలి.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను సాల్వ్ చేయడానికి అధిక ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉన్నవారు మాత్రమే ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా పరిష్కరిస్తారు. ఎక్కువ ఐక్యూ కలిగిన వ్యక్తుల్లో అధిక ఏకాగ్రత ఉండే అవకాశం ఉంది. కేవలం 5 సెకన్లలోనే మీరు ఆప్టికల్ ఇల్యూషన్‌ను చేధించగలిగితే మీరు చాలా తెలివైన వారని అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఒక శాతం మంది మాత్రమే ఐదు సెకన్లలో దీన్ని సాల్వ్ చేయగలుగుతారు.

ఆప్టికల్ ఇల్యూషన్ల చరిత్ర ఈనాటిది కాదు. వేల ఏళ్లనాడే వీటి గురించి బయటపడింది. ఆప్టికల్ ఇల్యూషన్లు మొదటిసారి గ్రీస్ దేశంలో బయటపడినట్లు చెబుతారు. కాబట్టి వీటి చరిత్ర కూడా ఆ దేశంలోనే మొదలైందనే భావన ఎక్కువ మందికి ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం