తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఆర్థరైటిస్ కోసం 7 అద్భుతమైన పండ్లు

ఆర్థరైటిస్ కోసం 7 అద్భుతమైన పండ్లు

HT Telugu Desk HT Telugu

15 October 2023, 6:30 IST

    • ఆర్థరైటిస్ లక్షణాలతో పోరాడడంలో మీకు సహాయపడే 7 రకాల పండ్లను ఇక్కడ చూడండి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.
ఆర్థరైటిస్‌కు చెక్ పెట్టే పండ్లు
ఆర్థరైటిస్‌కు చెక్ పెట్టే పండ్లు

ఆర్థరైటిస్‌కు చెక్ పెట్టే పండ్లు

ఆర్థరైటిస్ అనేది కీళ్ల నొప్పులు, వాపు, దృఢంగా మారడం, వంటి లక్షణాలతో బాధిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను నయం చేయలేనప్పటికీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఆ విధంగా ఈ లక్షణాలను తగ్గించవచ్చు. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు సిఫార్సు చేస్తారు. ఈ వ్యాధిని తిప్పికొట్టే ఆహారం ఏదీ లేనప్పటికీ, స్ట్రాబెర్రీలు , టార్ట్ చెర్రీస్, రాడ్ రాస్ప్‌బెర్రీలు, దానిమ్మ వంటి కొన్ని పండ్లను తినడం వల్ల మంటను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌ను నివారించడంలో, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్ల అవసరాన్ని చూపించిన అధ్యయనాలు కూడా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

‘ఆర్థరైటిస్ నిర్వహణ విషయానికి వస్తే, పండ్లు ఇచ్చే శక్తిని తక్కువ అంచనా వేయకండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో ఇవి కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి..’ అని పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా ఇటీవలి తన ఇన్‌స్టా పోస్ట్‌లో చెప్పారు.

ఆర్థరైటిస్‌ను నియంత్రించడంలో సహాయపడే పండ్లు

  1. మామిడి

పండ్ల ప్రేమికులు ఇష్టపడే మామిడి సాధారణంగా వేసవిలో ఎక్కువగా లభిస్తుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది. వీటిలో విటమిన్ సి, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు ఉన్నాయని, ఇవి వాపును తగ్గించడంలో, ఎముకల నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయని బాత్రా చెప్పారు.

2. స్ట్రాబెర్రీ

నోరూరించే స్ట్రాబెర్రీలు మీ కీళ్ల సంరక్షణకు అద్భుతమైన మార్గం. మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌తో పాటు ఊబకాయం ఉన్న పెద్దవారిలో మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. మృదులాస్థి దెబ్బతినకుండా స్ట్రాబెర్రీలు శక్తివంతంగా పనిచేస్తాయి. విటమిన్ సి కలిగి ఉండి ఆర్థరైటిస్, గుండె జబ్బులతో సంబంధం ఉన్న ఇన్‌ఫ్లమేషన్ మార్కర్ అయిన సి-రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్పీ) ను తగ్గిస్తాయి.

3. టార్ట్ చెర్రీస్

టార్ట్ చెర్రీస్ పేరు సూచించినట్లుగా కొంచెం టార్ట్, ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి. అయితే తీపి చెర్రీలు ముదురు రంగును కలిగి ఉంటాయి. ఫ్లేవనాయిడ్ ఆంథోసైనిన్ నుండి వాటి శక్తివంతమైన రోగ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తాయి.

4. రెడ్ రాస్ప్‌బెర్రీస్

వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్ అధికంగా ఉంటాయి. ఇవి ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

5. పుచ్చకాయ

పుచ్చకాయ సీఆర్పీని తగ్గిస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇందులో కెరోటినాయిడ్ బీటా-క్రిప్టోక్సాంటిన్ అధికంగా ఉంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. ఎరుపు, నలుపు ద్రాక్షలు

ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్లు, ఇతర పాలీఫెనాల్స్ వీటిలో ఉంటాయి. తాజా ఎరుపు, నలుపు ద్రాక్షలో రెస్వెరాట్రాల్ కూడా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ‌గా పనిచేస్తుంది.

7. దానిమ్మ

దానిమ్మలో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి వాపు, నొప్పి తీవ్రతను తగ్గిస్తాయి.

తదుపరి వ్యాసం