తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Skincare Tips: వేసవిలో చర్మం పాడవకుండా కాపాడుకోండిలా!.. ముఖ్యమైన 5 సూచనలు

Summer Skincare Tips: వేసవిలో చర్మం పాడవకుండా కాపాడుకోండిలా!.. ముఖ్యమైన 5 సూచనలు

16 May 2023, 10:01 IST

google News
    • Summer Skincare Tips: ఎండా కాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. చర్మం పాడవకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వాటిలో ముఖ్యమైన 5 సూచనలు ఇవి.
Summer Skincare Tips: వేసవిలో చర్మం పాడవకుండా కాపాడుకోండిలా!.. ముఖ్యమైన 5 సూచనలు (Photo: Unsplash)
Summer Skincare Tips: వేసవిలో చర్మం పాడవకుండా కాపాడుకోండిలా!.. ముఖ్యమైన 5 సూచనలు (Photo: Unsplash)

Summer Skincare Tips: వేసవిలో చర్మం పాడవకుండా కాపాడుకోండిలా!.. ముఖ్యమైన 5 సూచనలు (Photo: Unsplash)

Summer Skincare Tips: వేసవి కాలం తీవ్రమవుతోంది. ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. వేడి పెరగడం శరీరానికే కాకుండా చర్మానికి కూడా చాలా సవాలుగా ఉంటుంది. అందుకే వేసవిలో చర్మం పాడవకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకోసం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. హైడ్రేటెడ్‍గా ఉండడంతో పాటు సరైన సన్‍స్క్రీన్‍ను ఎంపిక చేసుకోవడం, ఆహారం సహా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అలా వేసవిలో మీ చర్మాన్ని సంరక్షించుకునేందుకు పాటించాల్సిన ముఖ్యమైన ఐదు సూచనలు ఏవో ఇక్కడ చూడండి.

యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్న ఆహారం

Summer Skincare Tips: వేడిగాలులు ఎక్కువగా ఉండే వేసవిలో చర్మాన్ని సంరక్షించుకునేందుకు ఆరోగ్యకరమైన డైట్ పాటించడం కూడా కీలకమైన అంశంగా ఉంది. యాంటీయాక్సిడెంట్లు (Antioxidants) ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయాలు వేసవిలో తినడం చర్మానికి మంచిది. సోలార్ రేడియేషన్‍ నుంచి చర్మానికి వచ్చే ప్రమాదకరమైన ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. వేసవి వేడి కారణంగా ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఇవి రక్షణగా ఉంటాయి. వేసవిలో మీరు తినే ఆహారంలో యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే.. అది మీ చర్మం డ్యామేజ్ కాకుండా ఆరోగ్యవంతంగా కాపాడుకునేందుకు సహాయపడుతుంది.

మీకు సూటయ్యే సన్‍స్క్రీన్

Summer Skincare Tips: వేసవిలో సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకర కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు చర్మానికి సన్‍స్క్రీన్‍(Sunscreen)ను ఉపయోగించాలి. మీ చర్మానికి సూటయ్యే సన్‍స్క్రీన్‍ను ఎంపిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సన్‍స్క్రీన్ చర్మానికి పూసుకున్నప్పుడు అక్కడ ఏవైనా రాషెస్, దద్దుర్లు, సెన్సివిటీస్ ఏర్పడితే, వేరే ప్రొడక్టుకు మారడం మంచిది. ఎండలో ఎంత సేపు ఉండే రక్షణ ఉంటుందో తెలిపే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF)ను సన్‍స్క్రీన్ ఎంపిక చేసుకునేటప్పుడు చెక్ చేయాలి.

హైడ్రేటెడ్‍గా ఉండండి

Summer Skincare Tips: డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం) ప్రభావం శరీరంపైనే కాకుండా మీ చర్మంపై కూడా ఉంటుంది. వేసవిలో చర్మం కూడా హైడ్రేషన్‍(Hydration)ను కోల్పోతుంది. అందుకే వేసవిలో తప్పకుండా మీ వెంట ఓ వాటర్ బాటిల్ ఉంచుకోవాలి. కనీసం అరగంటకు ఒకసారైన నీరు తాగాలి. అప్పుడప్పుడూ హైడ్రేటింగ్ జ్యూస్‍లు తాగాలి. పుచ్చకాయ లాంటి పండ్లను మీ డైట్‍లో చేర్చుకోవాలి.

క్లీన్‍సింగ్, మాయిశ్చరైజింగ్ లాంటివి..

Summer Skincare Tips: క్లీని‍సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ లాంటి అలవాట్లను వేసవిలో పాటించాలి. మీ చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ఆయిల్, చెమటను క్లీన్ చేసుకునేందుకు క్లీన్‍సింగ్ చేసుకోవాలి. మీ చర్మం పొడిబారకుండా, యూవీ రేడియేషన్‍ నుంచి రక్షణగా మాయిశ్చరైజింగ్ ఉంటుంది. వేసవి కాలంలో మీ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఈ స్కిన్‍కేర్ అలవాట్లు చాలా ఉపయోగపడతాయి.

ఎండకు ఎక్కువగా వెళ్లొద్దు

Summer Skincare Tips: ఒకవేళ చర్మంపై సన్‍బర్న్స్ (ఎండ వల్ల ఏర్పడే రాషెస్, గుల్లలు) ఏర్పడితే.. అవి తగ్గేందుకు ఎండలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. సన్‍బర్న్స్ ఏర్పడిన ప్రాంతంపై సూర్యరశ్మి పడకుండా జాగ్రత్త పడాలి. రక్షణగా ఏవైనా ప్రొటెక్టింగ్ క్లాత్ వాడాలి. నీడలోనే ఉండడం ఉత్తమం. ఎండలోకి వెళ్లాల్సి వస్తే సన్‍స్క్రీన్ రాసుకోవాలి. ఎవరైనా సరే, సూర్యతాపం ఎక్కువగా ఉండే ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ బయటికి వెళ్లినా.. సూర్యరశ్మి నేరుగా చర్మంపై పడకుండా గొడుగు వాడడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

తదుపరి వ్యాసం