తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  30 Before Thirty: 30 ఏళ్లలోపు చేయాల్సిన 30 పనులు

30 before thirty: 30 ఏళ్లలోపు చేయాల్సిన 30 పనులు

Zarafshan Shiraz HT Telugu

08 May 2023, 17:10 IST

google News
  • 30 before 30: మీ ముప్ఫయో పుట్టిన రోజు దగ్గర పడుతోందా? ఆలోపు మీరు చేయాల్సిన పనులేంటో చూడండి. 

ముప్పయేళ్ల లోపు చేయాల్సిన 30 పనులు
ముప్పయేళ్ల లోపు చేయాల్సిన 30 పనులు (Photo by Phinehas Adams on Unsplash)

ముప్పయేళ్ల లోపు చేయాల్సిన 30 పనులు

మీ ముప్పయో ఏట దగ్గరపడుతోందా? 1990 ల్లో పుట్టిన వాళ్లంతా ముప్పయేళ్లకు దగ్గర్లో ఉంటారు. అప్పుడే అంత వయసొచ్చేసిందా అనిపిస్తుంది. ఇప్పటికే మీరు చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. గెలుపోటములతో పోరాడటం ఎలాగో తెలుసుకొని ఉంటారు. ఆనందం, దు:ఖం, విజయాలు, వైఫల్యాలు, ప్రేమలు, నష్టాలు, కష్టాలతో చేసిన అందమైన అల్లిక అని అర్థమై ఉంటుంది.

ఈ వయసుకు వచ్చాక మీరొక కొత్త అధ్యాయం మొదలుపెడుతున్నట్లే. మీ గతంలో నేర్చుకున్న విషయాల తాలూకు పాఠాలు మీ భవిష్యత్తులో ఉపయోగించాలి. ముప్పై ఏళ్ల లోపు తప్పకుండా చేయాల్సిన, నేర్చుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఈ ముప్పయి విషయాలు చదివి మీకెన్ని మార్కులేసుకుంటారో చూడండి.

  1. ఒక విదేశీ ప్రయాణం
  2. కొత్త భాష నేర్చుకోవడం
  3. ఉన్నత విద్యలు లేదా ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేయటం
  4. మీకు ఇష్టమైన పనికి వాలంటీర్ గా చేరడం
  5. ఎవరి మీదా ఆధారపడకుండా బతకడం
  6. డబ్బు ఆదా చేయడం, భవిష్యత్తులో చేయాల్సిన పెట్టుబడుల గురించి ఆలోచించడం
  7. మీవాళ్లు అనిపించే స్నేహితుల్ని సంపాదించడం
  8. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం
  9. స్వీయ సంరక్షణకు సమయం ఇవ్వడం
  10. కొత్త వంటకాలు చేయడం నేర్చుకోవడం
  11. మీ తెలివి తేటల్ని పెంచుకోడానికి పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవడం
  12. మీకు ఆనందాన్నిచ్చే హాబీ అలవాటు చేసుకోవడం
  13. నాయకత్వ లక్షణాలు ఉండటం
  14. డబ్బు ఖర్చు పెట్టడం గురించి సరైన ఆలోచన ఉండటం
  15. ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోవడం
  16. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని లక్ష్యాలు పెట్టుకోవడం
  17. మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవడం
  18. విభిన్న కెరీర్ అవకాశాలను అన్వేషించి, మీ మనసకు నచ్చిన దాన్ని ఎంచుకోవడం
  19. ఓటమి నుంచి కూడా కొత్త అవకాశాలు సృష్టించుకోవడం
  20. విడిపోవడానికి కాకుండా జీవితాంతం తోడుండే బంధం కోసం ప్రయత్నించడం
  21. నో చెప్పగలగడం
  22. రిస్క్ తీసుకోండి మరియు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రండి.
  23. వర్క్ లైఫ్ బ్యాలన్స్ చేయగలగడం
  24. లోన్ తీసుకోవడం, డబ్బు ఆదా గురించి కనీస పరిజ్ఞానం ఉండటం
  25. ఒంటరిగా ప్రయాణం చేయడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం
  26. లోన్లు కట్టేసి సరైన క్రెడిట్ స్కోర్ ఉంచుకోవాలి
  27. ఏ విషయమైనా స్పష్టంగా తెలియజేయగల నేర్పు సంపాదించడం
  28. ఎదుటి మనిషిని అర్థం చేసుకోగలగడం
  29. జీవితంలో సాధించాల్సని కొత్త లక్ష్యాలను పెట్టుకోవడం
  30. ఆపత్కాలంలో జీవితాన్ని కాపాడే ఈత కొట్టడం, డ్రైవింగ్ నేర్చుకోవడం

ఇవన్నీ కేవలం సలహాలు మాత్రమే. ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా ఎదుగుతూ, మీ ఆనందం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాలి.

టాపిక్

తదుపరి వ్యాసం