Fridge | ఫ్రిజ్‌లో అవి అస్సలు పెట్టకండి.. ఎందుకంటే
03 March 2022, 13:21 IST
- ఫ్రిజ్ అనేది కొన్ని పదార్థాలను నిల్వచేసుకోవాడనికి మాత్రమే. అంతేకాని ఖాళీగా ఉందని.. ఏదిపడితే అది లోపల పెట్టేయడానికి కాదు. కొందరు ఏది పడితే అది ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. అది ముమ్మాటికి తప్పే అంటున్నారు నిపుణలు. సరైన ఆహారాన్ని మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలంటున్నారు. అసలు ఫ్రిజ్‌లో పెట్టకూడని 15 ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్రిజ్‌లో ఇవి అసలు పెట్టకండి..
Fridge Storage | ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ అనేది అవసరమైన వస్తువుగా మారిపోయింది. పైగా రానున్న వేసవి కాలంలో చాలా మంది వినియోగించేందుకు.. కొనేందుకు చూస్తారు. కానీ దానిలో ఏమి పెట్టవచ్చో.. ఏమి పెట్టకూడదో ఎప్పుడైనా తెలుసుకున్నారా? అవును ప్రతి ఆహార పదార్థాన్ని ఫ్రిజ్‌లో పెట్టవద్దు అంటున్నారు నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలు వేర్వేరు లక్షణాలు కలిగి ఉంటాయని.. వాటిని తగిన ఉష్ణోగ్రతలలోనే ఉంచాలని సూచిస్తున్నారు.
కొన్ని కూరగాయలు, లేదా పండ్లు ఫ్రిజ్‌లో నుంచి తీసి తినగానే వాటిని రుచి కోల్పోయి ఉంటాయి. ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ఆహార యూఎస్పీ మారిపోతుంది. పైగా కూరగాయాలు, లేదా పండ్లు కలిసి ఉన్నప్పుడు లేదా.. సరిగా ప్యాక్ చేయకుండా వాటిని ఫ్రిజ్‌లో అమర్చినప్పుడు.. వాటి వాసన, స్థిరత్వాన్ని కోల్పోయి రుచి పూర్తిగా మారిపోతుంది.
ఫ్రిజ్‌లో పెట్టకూడనివి..
1. అరటి పండ్లు: గది ఉష్ణోగ్రత వద్దే అరటి పండ్లను నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే వెచ్చని ఉష్ణోగ్రతలు పండు పూర్తిగా పక్వానికి వచ్చేలా సహాయపడతాయి. అంతే కాకుండా అవి త్వరగా కుళ్లిపోవు. ఒకవేళ ఫ్రిజ్‌లో పెడితే అవి త్వరగా పాడైపోయే అవకాశముంటుంది.
2. బ్రెడ్: బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే అది పాతబడి పొడిగా మారుతుందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవును, మీరు విన్న మా మాట నిజమే. అందుకే వాటిని డబ్బాలో ఉంచడానికి ప్రయత్నించండి.
3. టమోటాలు: టమోటాలను వంటగదిలో నిల్వ చేయడానికి చూడాలి. వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే.. వాటి ఆకృతి, రుచి మార్పులు వస్తాయని.. దిల్లీలోని అపోలో స్పెక్ట్రాకు చెందిన డైటీషియన్ దీక్షా అరోరా అన్నారు.
4. మూలికలు: మీరు తులసి లేదా రోజ్మేరీని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే, అవి త్వరగా ఎండిపోతాయి. మీరు ఈ మూలికలను ఒక చిన్న గ్లాసులో కొద్దిగా గది-ఉష్ణోగ్రత నీటిలో ఉంచవచ్చు. లేదా వంటగదిలో సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచవచ్చు.
5. హనీ: “మీకు తెలుసా? తేనెను ఫ్రిజ్‌లో ఉంచితే అది దాని రుచిని కోల్పోతుంది. దానికి బదులుగా తేనెను ఒక కంటైనర్‌లో నిల్వ చేసి, చీకటి ప్రదేశంలో ఉంచాలని నిపుణలు సూచిస్తున్నారు.
6. నూనె: ఫ్రిజ్‌లో వంటనూనె పెడితే అది గట్టిగా, పటిష్టంగా మారుతుంది. వంటగదిలోని చల్లని, చీకటి షెల్ఫ్‌లో మాత్రమే నూనెను భద్రపరచాలి
7. పుచ్చకాయలు: పుచ్చకాయలను కట్ చేయకుంటే వాటిని బయటే ఉంచాలంటున్నారు నిపుణులు. వాటిని ముక్కలు చేసిన తర్వాతనే ఫ్రిజ్‌లో నిల్వచేయవచ్చని తెలిపారు.
8. అవకాడో: పండని అవకాడో ఫ్రిజ్‌లో పండదు. కాబట్టి, వాటిని వంటగదిలో లేదా కౌంటర్‌టాప్‌లో వదిలివేయండి.
9. బంగాళదుంపలు: పచ్చి బంగాళదుంపలను ఒక బుట్టలో బహిరంగ ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది. ఫ్రిజ్‌లో మాత్రం నిల్వ ఉంచకూడదు. చల్లని ఉష్ణోగ్రత పచ్చి బంగాళాదుంపలలో కనిపించే పిండి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను మారుస్తుంది. వంట కోసం వాటిని ఉపయోగించినప్పుడు అవి తీపిగా మారుతాయి.
10. వెల్లుల్లి: వెల్లుల్లిని ఫ్రిజ్‌లో నిల్వచేయడం కంటే.. బహిరంగ ప్రదేశాలలోనే నిల్వచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
11. కాఫీ: కాఫీను, కాఫీ పౌడర్‌ను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే.. అది దాని చుట్టూ ఉన్న ఆహార పదార్థాల రుచిని తీసేసుకుంటుంది. దానిని సూర్యకాంతిలో ఉంచడానికి ప్రయత్నించండి.
12.ఉల్లిపాయలు: తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో కాకుండా ప్యాంట్రీలో నిల్వ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రిజ్‌లోని చల్లని ఉష్ణోగ్రత, అధిక తేమ ఉల్లిపాయలను పాడు చేస్తుంది.
13. చాక్లెట్: దీన్ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల తినదగనిదని కాదు కానీ.. అలా చేయడం వల్ల ఇది ఇతర ఆహార పదార్థాల వాసనలను ఇది గ్రహిస్తుంది. దాని స్థిరత్వం మారిపోతుంది. ఇది మీ ప్రేగును అస్థిరం చేస్తుంది. లేదా కడుపు నొప్పికి దారితీస్తుంది. చాక్లెట్‌ను బయట గది ఉష్ణోగ్రత వద్ద కూడా నిల్వచేయవచ్చు.
14. బెల్ పెప్పర్: మీరు బెల్ పెప్పర్‌ను ఇష్టపడేవారు అయితే దానిని ఫ్రిజ్‌లో పెట్టకండి. ఎందుకంటే దాని క్రంచ్ తక్కువ ఉష్ణోగ్రత వల్ల కుంగిపోతుంది.
15. దోసకాయ: దోసకాయలు, ఫ్రిజ్ లోపల ఉంచినప్పుడు, నీరు గుంటలుగా ఏర్పడుతుంది. ఫ్రిజ్‌లోనే పెట్టాల్సి వస్తే.. దాని పూర్తిగా కప్పి.. స్టోర్ చేసుకోవచ్చు.
కిరాణా వస్తువుల విషయానికి వస్తే.. ప్రతిదాన్ని ఒకేసారి షాపింగ్ చేయడానికి బదులుగా, వాటిని తక్కువ పరిమాణంలో కొనండి. ఈ విధంగా మీరు గరిష్ట ప్రయోజనాలను అందుకుంటారు. తద్వారా మీరు ఫ్రిజ్‌లో అనవసరమైన వస్తువులను నింపకుండా.. ఉండగలరు.