తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 15th April Episode: మనోహరి కోసం సిటీలో దిగిన ఉత్తరాది ముఠా.. కల్యాణ మండపానికి బయల్దేరిన అమర్​!

NNS 15th April Episode: మనోహరి కోసం సిటీలో దిగిన ఉత్తరాది ముఠా.. కల్యాణ మండపానికి బయల్దేరిన అమర్​!

Hari Prasad S HT Telugu

15 April 2024, 15:28 IST

google News
    • NNS 15th April Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (ఏప్రిల్ 15) ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. మనోహరి కోసం ఉత్తరాది ముఠా సిటీలో దిగగా.. మరోవైపు అమర్ పెళ్లి మండపానికి బయలుదేరుతాడు.
మనోహరి కోసం సిటీలో దిగిన ఉత్తరాది ముఠా.. కల్యాణ మండపానికి బయల్దేరిన అమర్​!
మనోహరి కోసం సిటీలో దిగిన ఉత్తరాది ముఠా.. కల్యాణ మండపానికి బయల్దేరిన అమర్​!

మనోహరి కోసం సిటీలో దిగిన ఉత్తరాది ముఠా.. కల్యాణ మండపానికి బయల్దేరిన అమర్​!

NNS 15th April Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (ఏప్రిల్ 15) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అరుంధతి నగలు మిస్సమ్మనే దొంగిలించి అమర్​తో తన పెళ్లి ఆపాలనుకుంటుంది అని అందరి ముందూ నిరూపిస్తుంది మనోహరి. అమర్ కూడా మనోహరి మాటలు నమ్మడంతో మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.

పెళ్లికూతురు అయిన మనోహరి మిస్సమ్మకు ఫోన్​ చేసి.. నీ పొగరు వెనక నీ బాధ అంతా తెలిసిపోతుంది పాపం.. అనవసరంగా ట్రై వేస్ట్ చేస్తున్నావు ఒక్క నిమిషం ఉండు అని భాజ భజంత్రీల సౌండ్ వినపడలా చేస్తుంది. భాగమతి బాధపడుతూ ఉంటుంది. రామ్మూర్తి వచ్చి ఓదారుస్తాడు.

మనోహరిని పెళ్లి చేసుకోలేనన్న అమర్

అమర్ రెడీ అయ్యాడు లేదో చూసి రా అని మనోహరి నీలా కి చెబుతుంది. అమరేంద్ర అరుంధతి ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రాథోడ్ అక్కడికి వస్తాడు. ఈ పెళ్లి బట్టలు కట్టుకొని మనోహరి మెడలో తాళి కట్టలేను రాథోడ్ ఈ విషయం అమ్మ నాన్నకి చెప్పేస్తాను అని అమరేంద్ర అంటాడు. నీలా వెళ్లి ఆ విషయం మనోహరి కి చెబుతుంది.

ఏంటే నువ్వు చెప్పేది ఈ పెళ్లి కోసమే కదా నేను ఇంతగా కష్టపడింది అని మనోహరి నీలా గొంతు పడుతుంది. అమ్మ ముందు నన్ను కొట్టడం ఆపేసి అమరేంద్రయ్య పెళ్లి చేసుకోనని వాళ్ళ అమ్మ వాళ్లకు చెప్తున్నాడు వెళ్లి ఆపండి అని నీలా అనడంతో మనోహరి వెళ్తుంది. మనోహరి అమరేంద్ర గదిలోకి వస్తుంది. నేను బయట ఉంటాను సార్ అంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు.

నేను కావాలని ఇలా చేయలేదు పరిస్థితుల వల్ల ఇలా చేయాల్సి వస్తుంది పద వెళ్లి ఆపేద్దాం అంటుంది మనోహరి. అమరేంద్ర షాక్ లో అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటి అమర్ అలా చూస్తున్నావ్ పుట్టగానే కన్న తల్లిదండ్రి వదిలేసారు.. పెళ్లిచూపులో నువ్వు వదిలేసావు.. ఆరు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇది కొత్త ఏం కాదు కదా అని మనోహరి అంటుంది.

నేనేమై పోయినా పర్వాలేదు అమర్ ఆరు ఈ పెళ్లి చూస్తే సంతోషిస్తుందనుకున్నాను. కానీ అక్కర్లేదు నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుతుందని చెప్పడానికి వచ్చాను పదా వెళ్లి పెళ్లి ఆపేద్దాం అంటుంది మనోహరి.

మనోహరి కోసం వెతుకుతున్న రౌడీ

బాగా ఆలోచించిన అమరేంద్ర పది నిమిషాల్లో పెళ్లి మండపానికి వెళ్ళిపోదాం అని బట్టలు తీసుకొని వెళ్ళిపోతాడు. సంతోషంతో మనోహరి వెళ్ళిపోతుంది. ఇంతసేపు ఆ భాగమతి, ఆత్మగా ఉన్న అరుంధతి అమ్మగారు వచ్చి పెళ్లి ఆపుతారు అనుకున్నాను.. మీ స్పీడ్ చూస్తుంటే ఎవరు ఈ పెళ్లి ఆపలేరు అని నీలా అనుకుంటుంది.

ఒకతను మనోహరి ఫోటో పట్టుకొని వాళ్ళని వీళ్లను అడుగుతూ ఉంటాడు. ఒక అబ్బాయిని ఈ అమ్మాయి ఫోటో నిజంగానే చూసావా రూమ్ నెంబర్ చెప్పు అని అడుగుతాడు. కార్ నెంబర్ రూమ్ నెంబర్ చెప్తాడు అబ్బాయి. దుర్గామాత నువ్వు ఉన్నావు అంటూ ఆ రౌడి నవ్వుతాడు. నాలాంటి వేల మందిని పెట్టి ఆ అమ్మాయి కోసం వెతికిస్తున్నారు అసలు ఎవరు సార్ ఆ అమ్మాయి అని అబ్బాయి అడుగుతాడు.

ఆ అమ్మాయి మాటలతో చీకట్లో పడి మోసపోయాం తను వెళ్ళిపోయాక తెలిసింది చీకట్లో ఉన్నామని చీకట్లో దొరకదు వెలుగులో కనిపించదు అందుకే ఇల్లు పిల్లని వదిలేసి తిరుగుతున్నాం అని అతను వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అదంతా చూస్తున్నా అరుంధతి బాధపడుతూ ఉంటుంది. చూస్తున్నారా గుప్తా గారు అందమైన కుటుంబం ఆనందంగా ఉండాల్సిన కుటుంబం మీ కళ్ళముందే బాధపడుతూ ఉంటే ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది అని అరుంధతి బాధపడుతుంది.

కోరికను తీరిస్తే దేవుడు ఉన్నాడని అంటారు.. తీర్చనిచో దేవుడే లేడు అంటాడు మానవులు అవివేకము ఏమీ అర్థం కాదు.. మనకు ఏది మంచో అదే దేవుడు ఇస్తాడని మానవులు అనుకున్నచో మానవుల జీవన విధానమే మారిపోవును అని గుప్తా అంటాడు.

పెళ్లి కొడుకుగా అమర్

కట్ చేస్తే, అమరేంద్ర పెళ్లి కొడుకుగా రెడీ అయి వస్తుండగా అరుంధతి చూసి షాక్ అయిపోతుంది. సారీ ఆరు నీకోసం చేస్తున్నానో నిన్ను బాధ పెడుతున్నానో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటూ అమరేంద్ర వెళ్ళిపోతాడు. అరుంధతి అది చూసి గుండెలు పగలేలా ఏడుస్తుంది. బంగారు లాంటి మా అమ్మ గారిని తీసుకువెళ్లి ఈ మనోహరిని ఈ కుటుంబానికి దగ్గర చేస్తున్నావా ఇదంతా ఎందుకు చేస్తున్నావు భగవంతుడా ఈరోజు అరుంధతి అమ్మగారే ఉంటే కాళికాదేవిలా మారి ఈ పెళ్లి ఆపేది ఈ కుటుంబాన్ని కాపాడేది.

అమ్మ అరుంధతి అమ్మగారు మీరు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపండి అని రాథోడ్ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. రాథోడ్ మాటలు విన్న అరుంధతి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉండిపోతుంది. కట్ చేస్తే, నేను వస్తున్నా మనోహరి చీకటిని చీల్చుకుంటూ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను అని ఆ రౌడీ అంటాడు. మనోహరి సంతోషంగా పెళ్లి మండపానికి వెళ్తూ ఉంటుంది. అసలు మనోహరిని వెతుక్కుంటూ వచ్చింది ఎవరు? అమర్​కి మనోహరి గతం తెలిసిపోతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం