తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Writer Padmabhushan Ott Release Date: రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పిన సుహాస్‌ - ఉగాదికి ముందే స్ట్రీమింగ్‌

Writer Padmabhushan OTT Release Date: రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పిన సుహాస్‌ - ఉగాదికి ముందే స్ట్రీమింగ్‌

08 March 2023, 11:35 IST

  • Writer Padmabhushan OTT Release Date: సుహాస్ హీరోగా న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను బుధ‌వారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్
రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్

Writer Padmabhushan OTT Release Date: రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ది. మార్చి 17 నుంచి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను వినూత్నంగా హీరోహీరోయిన్లు సుహాస్‌, టీనా శిల్ప‌రాజ్ బుధ‌వారం అనౌన్స్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

రిలీజ్ కోసం ఒక్క చిన్న బైట్ ఇవ్వ‌మ‌ని అడ‌గ్గా ... మాటి మాటికి ప్ర‌మోష‌న్స్ అంటూ నా వెంట ప‌డుతోన్నారేంట‌ని సుహాస్‌ బైట్ ఇవ్వ‌కుండా వెళ్లిపోవ‌డం ఈ వీడియోలో చెప్ప‌డం ఆస‌క్తిని పంచుతోంది.

ఓటీటీ రిలీజ్ డేట్ గురించి చెప్పాల‌ని అడ‌గ్గా ...ఎర్లీ ఉగాది కానుక‌గా మార్చి 17న రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ ఓటీటీలో రాబోతున్న‌ట్లు సుహాస్‌, టీనా శిల్ప‌రాజ్ ఇద్ద‌రు క‌లిసి రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 3న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిన్న ఈ సినిమా నిర్మాత‌ల‌కు రెండింత‌ల లాభాల్ని తెచ్చిపెట్టింది. ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ష‌ణ్ముఖ్ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ర‌చ‌యిత అబ‌ద్ధం ఆడితే...

ఇందులో ర‌చ‌యిత కావాల‌ని త‌పించే ప‌ద్మ‌భూష‌ణ్ అనే యువ‌కుడిగా సుహాస్ స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. తొలి అడుగు పేరుతో సొంతంగా ఓ బుక్ రాస్తాడు ప‌ద్మ‌భూష‌ణ్‌. కానీ ఆ బుక్ స‌క్సెస్ కాదు. అదే స‌మ‌యంలో అత‌డి పేరుతో మ‌రో పుస్త‌కం రిలీజై స‌క్సెస్ అవుతుంది.

అత‌డి పేరుతో ఏర్పాటైన బ్లాగ్‌ ఫేమ‌స్ అవుతోంది. మ‌ర‌ద‌లితో పెళ్లితో పాటు పేరుప్ర‌ఖ్యాతుల కోసం ఆ పుస్త‌కాన్ని రాసింది తానే అని అబ‌ద్ధం చెబుతాడు ప‌ద్మ‌భూష‌ణ్‌. ఆ అబ‌ద్ధం కార‌ణంగా అత‌డు ఎదుర్కొన్న ప‌రిణామాల‌ను వినోదాత్మ‌క పంథాలో ద‌ర్శ‌కుడు ష‌ణ్ముఖ్ ప్ర‌శాంత్ ఈ సినిమాలో ఆవిష్క‌రించారు. రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ సినిమాలో సుహాస్ త‌ల్లిదండ్రులుగా ఆశీష్ విద్యార్థి, రోహిణి న‌టించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.