తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: విక్ర‌మ్ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తా : విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: విక్ర‌మ్ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తా : విజయ్ దేవరకొండ

14 August 2022, 10:28 IST

  • విక్రమ్ (Vikram Movie)దర్శకుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌తో(lokesh kanagaraj) సినిమా చేయాలనుందని అన్నాడు  విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Deverakonda). చెన్నైలో జ‌రిగిన లైగ‌ర్ ప్రమోషనల్ ఈవెంట్‌లో విక్ర‌మ్ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌శంస‌ల్ని కురిపించారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ
విజ‌య్ దేవ‌ర‌కొండ (twitter)

విజ‌య్ దేవ‌ర‌కొండ

ఖైదీ, విక్ర‌మ్ సినిమాల‌తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన శైలిని క్రియేట్ చేసుకున్నాడు లోకేష్ క‌న‌క‌రాజ్‌. రెగ్యుల‌ర్ ఫార్మెట్స్‌కు భిన్నంగా త‌న సినిమాల్లో హీరోల‌ను వినూత్న రీతిలో ఆవిష్క‌రిస్తూ విజ‌యాల్ని అందుకుంటున్నాడు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విక్ర‌మ్ ఈ సినిమా ఈ ఏడాది ఇండియ‌న్ సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. విక్ర‌మ్ స‌క్సెస్ త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్‌తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్‌, కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కులు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

తాజాగా ఈ లిస్ట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ చేరిపోయాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న లైగ‌ర్ (Liger movie) సినిమా ఆగ‌స్ట్ 25న రిలీజ్ కానుంది. పాన్ ఇండియ‌న్ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో విజయ్ ప‌ర్య‌టిస్తున్నాడు. శ‌నివారం చెన్నైలో ఈ సినిమా ఈవెంట్ జ‌రిగింది. ఈ వేడుక‌లో లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాల‌కు తాను వీరాభిమాన‌ని విజ‌య్ దేవరకొండ పేర్కొన్నాడు. అత‌డి సినిమాటిక్ యూనివ‌ర్స్ లో ఏదో ఒక రోజు భాగం అవుతాన‌నే న‌మ్మ‌క‌ముంద‌ని పేర్కొన్నాడు.

భవిష్యత్తులో అత‌డి నుండి పిలుపు వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. లోకేష్ క‌న‌క‌రాజ్ తో పాటు తమిళంలో పా రంజిత్‌, వెట్రిమార‌న్ సినిమాలంటే ఇష్టమని విజయ్ దేవరకొండ అన్నాడు. లైగ‌ర్ సినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం