తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi 3 Days Collection: బాగా పెరిగిన ఖుషి కలెక్షన్స్.. సండే ఎఫెక్ట్.. హిట్ కావాలంటే మాత్రం!

Kushi 3 Days Collection: బాగా పెరిగిన ఖుషి కలెక్షన్స్.. సండే ఎఫెక్ట్.. హిట్ కావాలంటే మాత్రం!

Sanjiv Kumar HT Telugu

04 September 2023, 14:55 IST

google News
  • Kushi 3 Days Worldwide Collection: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఖుషి. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఖుషి 3 రోజుల కలెక్షన్స్ చూద్దాం.

ఖుషి కలెక్షన్స్
ఖుషి కలెక్షన్స్

ఖుషి కలెక్షన్స్

నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ సినిమాలు తెరకెక్కించిన శివ నిర్వాణ ఖుషి చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించగా మలయాళ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాద్ సంగీతం అందించాడు. ఇందులో మురళి శర్మ, సీనియర్ నటి లక్ష్మి, రోహిణి, సచిన్ ఖేడేకర్, వెన్నెల కోశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్‍గా విడుదలైన ఖుషి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఖుషి బిజనెస్

ఖుషి చిత్రానికి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‍లో 6 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్‍లో రూ. 20 కోట్ల వరకు మార్కెట్ చేసుకుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. వీటితోపాటు కర్నాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‍లో రూ. 7 కోట్లుగా బిజినెస్ నమోదు అయింది. ఇలా వరల్డ్ వైడ్‍గా ఖుషి సినిమాకు రూ. 52.50 కోట్ల ప్రీ రిలీజ్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా ఫిక్స్ అయింది.

3వ రోజున

ఖుషి చిత్రానికి 3వ రోజున నైజాంలో రూ. 2.75 కోట్లు, సీడెడ్‍లో రూ. 69 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 77 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, గుంటూరులో రూ. 33 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలు వసూళు అయింది. మొత్తంగా 3వ రోజు రూ. 5.68 కోట్ల షేర్, రూ. 9.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఆదివారం కాడవంతో ఖుషికి వసూళ్లు అంతకుముందు కంటే ఎక్కువగా నమోదు అయ్యాయి.

3 రోజుల్లో

ఖుషికి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో రూ. 11.20 కోట్లు, సీడెడ్‍లో రూ. 2.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.26 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1 కోటి, గుంటూరులో రూ. 1.26 కోట్లు, కృష్ణాలో రూ. 1.08 కోట్లు, నెల్లూరులో రూ. 62 లక్షలు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 20.91 కోట్లు షేర్, రూ. 34.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. ఇక కర్ణాట రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.45 కోట్లు, ఓవర్సీస్‍లో రూ. 7.10 కోట్లు, ఇతర భాషల్లో రూ. 2.10 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 32.53 కోట్ల షేర్, రూ. 60.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

ఇంకా ఎంత రావాలంటే?

అయితే ఖుషి చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5350 కోట్లుగా నమోదు అయింది. ఖుషి సినిమాకు 3 రోజుల్లో రూ. 32.53 కోట్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తయి ఖుషికి లాభాలు రావాలంటే మాత్రం రూ. 20.97 కోట్లు కలెక్ట్ చేయాలి. రూ. 20.97 కోట్లు వస్తేనే సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. చూస్తుంటే ఈ కలెక్షన్స్ ను కూడా త్వరలోనే ఖుషి సినిమా కొల్లగొడుతుందని తెలుస్తోంది

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం