తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sara Ali Khan : విమానాశ్రయంలో దొంగతనం చేసిన స్టార్ హీరోయిన్

Sara Ali Khan : విమానాశ్రయంలో దొంగతనం చేసిన స్టార్ హీరోయిన్

Anand Sai HT Telugu

09 June 2023, 13:07 IST

    • Sara Ali Khan : విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కలిసి నటించిన చిత్రం జరా హాట్కే జరా బచ్కే. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. సినిమా సక్సెస్ మీట్‌లో సారా ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఓ వస్తువును దొంగిలించిందని విక్కీ కౌశల్ వెల్లడించాడు.
విక్కీ కౌశల్, సారా
విక్కీ కౌశల్, సారా (twitter)

విక్కీ కౌశల్, సారా

బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్కీ కౌశల్(Vicky Kushal), సారా అలీ ఖాన్(Sara Ali khan) జరా హాట్కే జరా బచ్కే సినిమా ద్వారా అభిమానుల ముందుకు వచ్చారు. సారా, విక్కీ కౌశల్ ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇద్దరూ అనేక రాష్ట్రాల్లో పర్యటించి ప్రచారం చేశారు. అహ్మదాబాద్ నుంచి ఇండోర్‌తో సహా పలు రాష్ట్రాల్లో ప్రమోషన్లో పాల్గొన్నారు. అభిమానులతో సంభాషిస్తూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. సారా, విక్కీ ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రచారం సందర్భంగా విక్కీ కౌశల్.. సారా అలీ ఖాన్ కు సంబంధించిన ఓ విషయాన్ని వెల్లడించాడు.

ట్రెండింగ్ వార్తలు

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ

విమానాశ్రయంలో విశ్రాంతి తీసుకున్న సారా అలీ ఖాన్ దొంగిలించిన వస్తువు గురించి విక్కీ కౌశల్(Vicky Kaushal) వెల్లడించాడు. ఎయిర్‌పోర్ట్ లాంజ్ లో పడుకుని లేచాక.. సారా అలీ ఖాన్ దిండును ఎత్తకొచ్చిన విషయాన్ని విక్కీ చెప్పాడు. హోటల్ నుండి ఏదైనా వస్తువులు తీసుకున్నారా అని ఇంటర్వ్యూలో అడిగారు. దీనికి విక్కీ కౌశల్ రిప్లై ఇస్తూ సారా అలీ ఖాన్ చేసిన దొంగతనం గురించి చెప్పాడు.

'మేం ఒక నెల పాటు పర్యటనలో ఉన్నాం. షాంపూ, కండీషనర్, లోషన్లు, టూత్‌పేస్ట్‌లను సేకరించాను. మళ్లీ అలా చేయకూడదని నేర్చుకున్నాను.' అని సారా అలీ ఖాన్ చెప్పింది. సారా మాట్లాడుతుండగా.. విక్కీ కౌశల్ జోక్యం చేసుకుని ప్రమోషన్ సమయంలో విమానాశ్రయంలోనే నిద్రపోయేదని తెలిపాడు. అయితే ఎయిర్ పోర్ట్ లాంజ్ లో పడుకుని.., ఆ దిండును తీసుకుందని చెప్పాడు. మూడు రాష్ట్రాలకు దిండును తీసుకెళ్లినట్టుగా విక్కీ వెల్లడించాడు.

జరా హత్కే జరా బచ్కే సినిమా(zara hatke zara bachke)విడుదలైన మొదటి వారంలో 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం చిత్ర బృందం సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే, విక్కీ కౌశల్ తర్వాత మేఘనా గుల్జార్ దర్శకత్వంతో సామ్ బహదూర్ చిత్రంలో కనిపించనున్నాడు. డిసెంబర్ 1న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, సారా అలీ ఖాన్ నటించిన తదుపరి చిత్రం మెట్రో...ఇన్ డినో డిసెంబర్లోనే విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం