తెలుగు న్యూస్  /  Entertainment  /  Venkatesh Signed On Three Seasons Of Rana Naidu

Venkatesh Signed Rana Naidu: 'రానా నాయుడు' వదిలేలా లేడుగా..! మరో మూడు సీజన్లకు బూతు పర్వం తప్పదా?

12 March 2023, 11:08 IST

    • Venkatesh Signed Rana Naidu: రానా నాయుడు సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్‌పై నెగిటివిటీ వస్తోంది. ముఖ్యంగా అసభ్యకరమైన డైలాగులు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మరో రెండు సీజన్లు చేసేందుకు వెంకీ సంతకం పెట్టారట.
రానా నాయుడు
రానా నాయుడు (MINT_PRINT)

రానా నాయుడు

Venkatesh Signed Rana Naidu: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. బూతులు ఎక్కువగా ఉన్నాయని ఈ సిరీస్ చూసిన వాళ్లు చెబుుతుండటం దీనిపై నెగిటివిటీని పెంచుతుంది. రానా, వెంకటేష్ కలిసి తొలిసారిగా నటించిన ప్రాజెక్టు కావడంతో అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచింది. వెంకీ లాంటి సాఫ్ట్ హీరో భారీగా బూతులు మాట్లాడటం వారిని కాస్త ఇబ్బందికి గురిచేసింది. అయితే ఈ సిరీస్ ఒక్క సీజన్‌తో ఆగేలా లేదు. మరో మూడు సీజన్లు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో 5 భాషల్లో మలయాళ బ్లాక్ బస్టర్ హిట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Krishna mukunda murari may 2nd:మీరాని అనుమానించిన మురారి.. భవానీ ఆనందాన్ని చెడగొట్టిన ముకుంద

Vennela Kishore OMG Movie: అక్షయ్ కుమార్ టైటిల్‌తో వెన్నెల‌కిషోర్ హార‌ర్ మూవీ - ఓ మంచి ద‌య్యం భ‌య‌పెడుతోంద‌ట‌!

Brahmamudi May 2 Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లికోసం 10 లక్షలు ఇచ్చిన రాజ్- స్వప్నకు 2 రోజుల గడువు- అప్పు కావ్య ప్లాన్

ఇందుకు వెంకటేష్ కూడా మూడు సీజన్లకు నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకున్నారట. ఈ విషయంలో రానా గట్టిగా కోరుకున్నారట. దీంతో చేసేదేమి లేక వెంకీ కూడా సంతకం చేసినట్లు సమాచారం. వెంకటేష్ స్వయంగా పాల్గొనడానికి ఇష్టపడకపోయినా రానా వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మరో రెండు సీజన్‌లతో కొనసాగాలి.

నాయుడు వెబ్ సిరీస్ మొదటి సీజన్ చాలా నెగిటివిటీ టాక్ అందుకుంది. కొంతమంది అభిమానులు పాజిటివ్ టాక్ ఇస్తున్నప్పటికీ చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రతికూల సందేశాలను ఇస్తున్నారు. మరో రెండు సీజన్‌లను కొనసాగించడం సమస్య కాదు. కానీ మొదటి సీజన్‌పై విమర్శలు రావడం వల్ల ఫ్రెండ్లీ ఇమేజ్ ఉన్న వెంకీపై ప్రభావం చూపవచ్చు.

అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు తెరకెక్కింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.