Saindhav OTT: 2 ఓటీటీల్లో వెంకటేష్ సైంధవ్! ఆ పండుగకు రిలీజ్? ఎందులో స్ట్రీమింగ్ అంటే?
13 January 2024, 11:16 IST
Saindhav OTT Release: విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. భారీ అంచనాల నడుమ జనవరి 13న విడుదలైన సైంధవ్ మూవీకి రెస్పాన్స్ బాగానే వస్తోంది. ఈ నేపథ్యంలోనే సైంధవ్ ఓటీటీ పార్టనర్, రిలీజ్ డేట్ ఆసక్తికరంగా మారాయి.
2 ఓటీటీల్లో వెంకటేష్ సైంధవ్! ఆ పండుగకు రిలీజ్? ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Saindhav OTT Streaming: ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ 75వ చిత్రంగా నటించిన మూవీ సైంధవ్. ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ సైంధవ్‌కు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సైంధవ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాకు భారీగా బజ్ క్రియేట్ అయింది.
ఎట్టకేలకు గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగింది వెంకటేష్ సైంధవ్ మూవీ. సైంధవ్ మూవీకి నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సైంధవ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అన్ని రకాల ఎమోషన్లతోపాటు యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఇక సెకండాఫ్ ఫైటింగ్ సీన్స్ అయితే ఎక్సలెంట్ అని చెబుతున్నారు ఫ్యాన్స్.
మరికొంతమంది సినిమా కాస్తా స్లో నేరేషన్‌తో ఉందని, కొన్ని బ్లాక్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిస్తే బాగుండేదని అంటున్నారు. ఇలా భిన్నాభిప్రాయాలతో సైంధవ్ మూవీకి ఇప్పటికైతే మిక్స్‌డ్ టాక్ వస్తోంది. పూర్తి షో తర్వాత ఎలా ఉందో రివ్యూల ద్వారా తెలియనుంది. ఇదిలా ఉంటే శనివారం మూవీ విడుదల నేపథ్యంలో సైంధవ్ ఓటీటీ డీల్ ఆసక్తికరంగా మారింది. సైంధవ్ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు రిలీజ్ కానుందని ఓటీటీ లవర్స్ వెతికే పనిలో పడ్డారు.
వెంకటేష్ సైంధవ్ మూవీ ఓటీటీ పార్టనర్ వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. సైంధవ్ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. సైంధవ్ ఓటీటీ హక్కులకు భారీ పోటీ ఏర్పడగా ఆఖరుకు భారీ ధర వెచ్చించి అమెజాన్ ప్రైమ్ చేజిక్కుంచుకుందని తెలుస్తోంది. సైంధవ్ కోసం పోటీలో ఉన్న దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను వెనక్కి నెట్టి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని నిర్మాతలు వెల్లడించినట్లు సమాచారం.
ఇక సైంధవ్ మూవీని థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. లేదా నెలకు పైగా కూడా ఓటీటీ రిలీజ్‌కు సమయం తీసుకునే వాదనలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే సైంధవ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి రెండో వారంలో మహాశివరాత్రి సందర్భంగా లేదా మార్చిలో ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే, అమెజాన్ ప్రైమ్‌తో పాటు సైంధవ్ ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ కూడా దక్కించుకుందని మరో న్యూస్ వినిపిస్తోంది. ఇందులో 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్.
ఇదిలా ఉంటే వెంకటేష్, హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన సైంధవ్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. ఆయనతోపాటు తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెరెమియా, హీరోయిన్ రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, జిషు సేన్‌గుప్తా, ముకేష్ రిషి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. సైంధవ్ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. కాగా సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు.