తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sankranti Theatrical Business: సంక్రాంతికి బాక్సాఫీస్ బిజినెస్ ఎంత? బరిలో బాలయ్య-వీరయ్య..!

Sankranti Theatrical Business: సంక్రాంతికి బాక్సాఫీస్ బిజినెస్ ఎంత? బరిలో బాలయ్య-వీరయ్య..!

04 January 2023, 9:30 IST

    • Sankranti Theatrical Business: సంక్రాంతికి ఈ సారి ఇద్దరూ స్టార్ హీరోలు అమి తుమీ తేల్చుకోనున్నారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవీ నటించి వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో థియెట్రికల్ బిజినెస్ భారీగా జరుగుతోంది.
వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి బాక్సాఫీస్ హంగామా
వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి బాక్సాఫీస్ హంగామా

వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి బాక్సాఫీస్ హంగామా

Sankranti Theatrical Business: సంక్రాంతి సీజన్ వచ్చిందటే చాలు.. బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షం కురుస్తోంది. అందుకే స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు తమ చిత్రాలను విడుదల చేయాలని తహ తహలాడుతుంటారు. ఈ సారి మెగాస్టార్ చిరంజీవితో పాటు నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరూ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు ఈ సారి సందడి చేయనున్నాయి. ఈ రెండు చిత్రాలకూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడం విశేషం. అంతేకాకుండా ఈ రెండింట్లోనూ శృతి హాసనే హీరోయిన్. దీంతో థ్రియెట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

మూవీ బడ్జెట్..

నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రానికి రూ.100 కోట్లు కాగా.. వాల్తేరు వీరయ్య చిత్రానికి రూ.140 కోట్లు ఖర్చు చేసినట్లు ఫిల్మ్ వర్గాల అంచనా. ఇందులో రెమ్యూనరేషన్ కూడా ఉంది. వీరసింహారెడ్డి కోసం బాలయ్య రూ.15 కోట్ల తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క వాల్తేరు వీరయ్య కోసం మెగాస్టార్, మాస్ మహారాజా ఇద్దరూ కలిసి రూ.50 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇరు చిత్రాలకు బడ్జెట్‌ వంద కోట్లకు పైనే అయినట్లు అంచనా వేశారు.

థియేటర్ మార్కెట్..

ఈ రెండు చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ మార్కెట్ భారీగానే ఉంది. ఆంధ్ర ప్రాంతంలో రెండు సినిమాలకు కలిపి రూ.75 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వీరసింహారెడ్డికి రూ.35 కోట్లు కాగా.. వాల్తేరు వీరయ్యకు రూ.40 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే సీడెడ్‌లో ఈ రెండు చిత్రాలకు రూ. 27 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఇందులో బాలయ్య చిత్రానికి రూ.12.5 కోట్లు కాగా.. మెగాస్టార్ మూవీకి రూ.14.5 కోట్లుగా ఉంది. నైజాం ప్రాంతంలో రెండు సినిమాలకు కలిపి రూ.33 కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో వీరసింహారెడ్డి షేర్ రూ.15 కోట్లు కాగా.. వాల్తేరు వీరయ్యకు రూ.18 కోట్లుగా ఉంది. అన్ని ప్రాంతాలు కలిపి నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్‌గా ఇవ్వడమైంది. కాబట్టి ఓవర్ ఫ్లో ఉంటే నిర్మాతలకు ఎక్కువ వస్తుంది. ఒకవేళ మిక్స్‌డ్ టాక్ వస్తే నిర్మాతలు రూ.30 కోట్ల వరకు జీఎస్‌టీ ఖర్చులను భరించాలి.

బ్రేక్ ఈవెన్ రావాలంటే..

ఆంధ్ర, సీడెడ్, నైజాం మొత్తం మీద ఈ రెండు చిత్రాలకు కలిపి రూ.135 కోట్ల వరకు థియెట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఇందులో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బయ్యర్లకు బడ్జెట్‌పై కనీసం 10 శాతం రావాలి. ఇతర కమీషన్లు కలిపి అదనంగా 20 శాతం కలిస్తే మినహా బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు. కానీ మెగాస్టార్, బాలకృష్ణ ఇద్దరూ స్టార్ హీరోలు కావడంతో బ్రేక్ ఈవెన్‌కు ఎలాంటి లోటు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా శాటిలైట్ హక్కులు, డిజిటల్ రైట్స్ ఇందులో జోడించలేదు.

బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకురుస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం