Varasudu Movie Review : విజయ్ దళపతి 'వారసుడు' రివ్యూ.. సినిమా ఎలా ఉంది?
14 January 2023, 10:53 IST
- Varasudu Telugu Movie Review : సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో వారసుడు ఒకటి. విజయ్ దళపతి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చింది సినిమా. తమిళంలో వారిసు పేరుతో ముందుగానే విడుదలైంది. ఇంతకీ చిత్రం ఎలా ఉంది?
వారసుడు సినిమా రివ్యూ
నటీనటులు : విజయ్, రష్మిక, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కుష్బూ తదితరులు, మ్యూజిక్ : తమన్, సినిమాటోగ్రఫీ : కార్తిక్ పళని, ఎడిటింగ్ : ప్రవీణ్, దర్శకత్వం : వంశీ పైడిపల్లి, నిర్మాత : దిల్ రాజు,
కథ
రాజేంద్రన్(శరత్ కుమార్) ఓ పెద్ద వ్యాపారవేత్త. అతడికి ముగ్గురు కుమారులు జై(శ్రీకాంత్), అజయ్(శ్యామ్), విజయ్(విజయ్). తన వ్యాపార సామ్రాజ్యాన్ని ముగ్గురు కొడుకుల్లో ఎవరికైనా అప్పుజెప్పాలనుకుంటాడు రాజేంద్రన్. కానీ తండ్రి విధానాలు విజయ్ కు నచ్చవు. అన్నలు మాత్రం ఛైర్మన్ కుర్చీపై కన్నేస్తారు. ఇంట్లో నుంచి ఏడు సంవత్సరాలు బయటకు వెళ్తాడు విజయ్. తల్లి సుధ (జయసుధ) చెప్పినా వినిపించుకోడు. ఇంట్లో నుంచి వెళ్లాక ఓ కంపెనీ ప్రారంభిస్తాడు.
ఇదే సమయంలో రాజేంద్రన్ సామ్రాజ్యాన్ని జయ ప్రకాశ్(ప్రకాశ్ రాజ్) కూల్చేయాలనుకుంటాడు. కుట్రలు చేస్తాడు. ఇంటికి సంబంధించిన ఓ కార్యక్రమం కోసం విజయ్ ఏడేళ్ల తర్వాత వస్తాడు. అనుకోని కారణాలతో కార్యక్రమం ఆగిపోతుంది. మళ్లీ ఇంట్లో నుంచి బయటపడాలనుకుంటాడు విజయ్. కానీ అప్పుడే కొన్ని నిజాలు తెలుస్తాయి. ముక్కలైన తన కుటుంబాన్ని ఎలా కలిపాడు? జయ ప్రకాశ్ చేస్తున్న కుట్రలకు ఎలా స్పందించాడు? తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు? రష్మికతో ప్రేమ ఏం జరిగింది? అసలు విజయ్ ఇంటికి తిరిగి వచ్చేందుకు కారణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
ఎలా ఉందంటే..?
ఇలాంటి క్యారెక్టర్ విజయ్ ఈజీగా చేసేస్తాడు. రష్మిక మందన నటన ఓకే అనిపిస్తుంది. జయసుధ, శరత్‌కుమార్, శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్ పాత్రలకు తగ్గట్టుగా చేశారు. కార్తీక్ పళని విజువల్స్ సినిమాని రిచ్‌గా చూపిస్తాయి. తమన్ మ్యూజిక్ కూడా వారసుడుకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సీన్లు ఎలివేట్ అయ్యేందుకు ఉపయోగపడింది. మేకింగ్ విషయంలో గ్రాండియర్‌గానే ఉంది. దర్శకుడు వంశీ పైడిపల్లి పాత సబ్జెక్ట్ ను కాస్త అటు ఇటు చేసి చెప్పినట్టుగా అనిపిస్తుంది.
ఇలాంటి కథలతో చాలా సినిమాలు చూశారు ప్రేక్షకులు. అయితే ఇది విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం నచ్చుతుంది. పాత కమర్షియల్ ఫార్మాట్ లోనే కథ వెళ్తుంది. కొత్తదనం ఉన్నట్టుగా అనిపించదు. ఈ సినిమా దళపతి విజయ్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్లు ముందుగానే అంచనా వేయోచ్చు. కమర్షియల్, ఫ్యామిలీ డ్రామా సినిమాలకు మీరు అభిమాని అయితే.. సినిమా కాస్త నచ్చే అవకాశం ఉంది.
రేటింగ్ : 2.25/5