తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Drugs Case: డ్రగ్స్ కేసు కలకలం.. వరలక్ష్మీ శరత్ కుమార్ కు నోటీసులు.. ఏం జరిగిందంటే?

Drugs Case: డ్రగ్స్ కేసు కలకలం.. వరలక్ష్మీ శరత్ కుమార్ కు నోటీసులు.. ఏం జరిగిందంటే?

Sanjiv Kumar HT Telugu

29 August 2023, 20:12 IST

  • Varalaxmi Sarathkumar Drugs Case: నాంది, క్రాక్, వీర సింహారెడ్డి చిత్రాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్‍ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. తాజాగా ఆమెకు ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్‍కు నోటీసులు
డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్‍కు నోటీసులు

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్‍కు నోటీసులు

Varalaxmi Sarathkumar In Kerala Drugs Case: సీనియర్ నటుడు శరత్ కుమార్‍ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ కోలీవుడ్‍లో హీరోయిన్‍గా అలరించింది. కానీ, అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత నటిగా, విలన్‍గా అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులోనూ క్రాక్, యశోద, వీర సింహా రెడ్డి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఆమె కేరళలోని డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

కేరళలోని వియిన్యం సముద్ర తీరం వద్ద ఆగస్ట్ 18న భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు, మారణ ఆయుధాలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ విఘ్నేష్ పేరుతో ఉన్న ఫిషింగ్ బోట్ నుంచి సుమారు 300 కిలోల హెరాయిన్, ఒక ఏకే 47 రైఫిల్, 17 రౌండ్ల బులెట్స్, ఐదు 9ఎమ్ఎమ్ పిస్తోళ్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో హెరాయిన్ విలువ రూ. 2100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

అయితే ఈ డ్రగ్స్ కేసులో వరలక్ష్మీ శరత్ కుమార్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఆదిలింగం వివరాలను సేకరించేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్ విచారణకు హాజరు కావాల్సిందింగా ఎన్ఐఏ ఆదేశాలు జారీ చేసింది. కొచ్చి ఆఫీస్‍లో వరలక్ష్మి శరత్ కుమార్‍ను అధికారులు విచారించనున్నట్లు సమాచారం. ఆదిలింగంతో పాటు ఆమెకున్న సంబంధం గురించి స్టేట్‍మెంట్ రికార్డ్ చేయనున్నారు.

ఆదిలింగం డ్రగ్స్ ద్వారా సంపాదించిన డబ్బును సినిమాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ విషయంపై కూడా వరలక్ష్మి శరత్ కుమార్‍ను ఎన్ఐఏ ప్రశ్నించనుందని సమాచారం. అయితే, ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్‍కు నోటీసులు జారీ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కేవలం నటి మాత్రమే కాకుండా నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ కూతురు కావడంతో హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ ఎక్స్ పీఏ ఆదిలింగంతోపాటు మరో ఐదుగురు వ్యక్తులపై ఎన్ఐఏ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్, ఆయుధాలను ఇరాన్ లేదా పాకిస్థాన్ నుంచి శ్రీలంక మీదుగా ఇండియాకు తీసుకొచ్చారని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం