తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases | ఈవారం ఓటీటీల‌లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.

OTT Releases | ఈవారం ఓటీటీల‌లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.

Nelki Naresh HT Telugu

14 April 2022, 5:28 IST

    • ఈ వారం ఓటీటీ లలో పలు టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాలు విడుదలకాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...
అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ (twitter)

అక్షయ్ కుమార్

బ‌చ్చ‌న్ పాండే-అమెజాన్ ప్రైమ్‌

అక్షయ్ కుమార్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం బ‌చ్చ‌న్‌ పాండే అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 15 నుండి స్ట్రీమింగ్ కానున్నది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్షద్ వార్సీ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో 70 కోట్ల వరకు మాత్రమే వసూళ్లను సాధించి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

పునీత్ రాజ్ కుమార్- జేమ్స్‌

దివంగత కన్నడ అగ్ర హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఈ నెల 14(నేడు) నుండి సోనిలివ్ ద్వారా స్ట్రీమింగ్ కానున్న‌ది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించారు.

మాయ్ -నెట్ ఫ్లిక్స్

సాక్షి తన్వర్, రైమా సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన మాయ్ సిరీస్ ఈ నెల 15న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్షయ్ లాల్, అతుల్ మోంగియా దర్శకత్వం వహించారు.

రామ్ గోపాల్ వ‌ర్మ -ద‌హనం-ఎమ్ఎక్స్ ప్లేయ‌ర్‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ దహనం. నైనా గంగూలీ, అభిషేక్ దుహాన్, అభిలాష్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమ్ఎక్స్ ప్లేయర్ ద్వారా 14న (నేడు)ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

గాలివాన- జీ5

రాధిక శరత్ కుమార్, సాయికుమార్, నందినిరాయ్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 14న‌ జీ5 ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది. శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు.

బ్లడీమేరి- ఆహా

నివేథా పేతురాజ్ ప్రధాన పాత్రలో న‌టించిన‌ వెబ్ ఫిల్మ్ బ్లడీ మేరి ఆహా ఓటీటీ ద్వారా ఈ నెల 15న రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ పాయింట్‌తో రూపొందిన ఈ వెబ్ ఫిల్మ్ కు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కిరిటీదామరాజు, రాజ్ కుమార్, అజయ్ కీలక పాత్రల్లో నటించారు.

ఆడవాళ్లు మీకు జోహార్లు- సోనిలివ్

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఈ నెల 14న సోని లివ్ ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

డెత్ ఆన్ ది నైల్- డిస్నీ హాట్ స్టార్ -ఏప్రిల్ 15

అనాటమీ ఆఫ్ ఏ స్కాండల్- నెట్ ఫ్లిక్స్- ఏప్రిల్ 15

ఔటర్ రేంజ్- అమెజాన్ ప్రైమ్- ఏప్రిల్ 15

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం